ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్మిక వర్గ పక్షపాతి పెంటయ్య: జూలకంటి

ABN, First Publish Date - 2022-05-19T07:05:01+05:30

సీఐటీయూ నాయకుడు పచ్చిమట్టల పెంటయ్య కార్మిక పక్షపాతని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.

పెంటయ్య వర్ధంతి సభలో మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట సిటీ, మే 18: సీఐటీయూ నాయకుడు పచ్చిమట్టల పెంటయ్య కార్మిక పక్షపాతని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో సీఐటీయూ జిల్లా కమిటీ ఆఽధ్వర్యంలో పెంట య్య ప్రథమ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. సీఐటీయూని బలోపేతం చేయ టంలో పెంటయ్య కీలకపాత్ర పోషించాడని అన్నారు. పలు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశాడన్నారు.  సుందరయ్యనగర్‌లోని ప్రభుత్వ భూమిలో ఎర్రజెండాలను పాతి  దీర్ఘకాలిక పోరాటాల ద్వారా 250 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించడంలో పెంటయ్య ప్రధాన పాత్ర పోషించాడని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం కార్మి కులు సంఘటితంగా ఉద్యమించాలన్నారు.  అనంతరం పెంటయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఐటీయూ జిల్లా అధ్య క్షుడు నెమ్మాది వెంకటేశ్వర్లు ఆధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లు నాగార్జునరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఉప్పల లలిత, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కొలిశెట్టి యాద గిరి, మార్కెట్‌ కార్యదర్శి ఎండీ ఫసియోద్దీన్‌,  శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్‌ చెరుకు యాకలక్ష్మి, గిరిజన సంఘం రాష్ట్ర నాయకుడు రవి నాయక్‌, ఎల్గూరి గోవింద్‌, కోట గోపి, వెల్పుల వెంకన్న, ధనియాకుల శ్రీకాంత్‌వర్మ, మేకనబోయిన శేఖర్‌ పాల్గొన్నారు.



Updated Date - 2022-05-19T07:05:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising