ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్టీలో చేర్చుకుని ఇబ్బంది పెడతారా?

ABN, First Publish Date - 2022-12-10T00:58:04+05:30

అవసరానికి పార్టీలో చేర్చుకుని ఇబ్బందులు పెట్టడం ఎంతవరకు సమంజసమని డీసీసీబీ మాజీ చైర్మన్‌ ముత్తవరపు పాండురంగారావు ప్రశ్నించారు. కోదాడలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు నివాసంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2015 లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున కాపుగ ల్లు పీఏసీఎ్‌సలో తాను డైరెక్టర్‌గా ఆ తరువాత డీసీసీబీ చైర్మన్‌గా ఎన్నికయ్యానన్నారు. ఈ క్రమంలో కాపుగల్లు సొసైటీలో 15వేల క్విం టాళ్ల ధాన్యం కుంభకోణం జరిగిందని తనపై కేసుపెట్టారని అదే సమయంలో మంత్రి కేటీఆర్‌, జగదీ్‌షరెడ్డి టీఆర్‌ఎ్‌సలో చేరాలని ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న డీసీసీబీ మాజీ చైర్మన్‌ ముత్తవరపు పాండురంగారావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైతులకు రూ.82 లక్షలు చెల్లించినా అక్రమాలు అనడం సరికాదు

డీసీసీబీ మాజీ చైర్మన్‌ ముత్తవరపు పాండురంగారావు

కోదాడ, డిసెంబరు 9: అవసరానికి పార్టీలో చేర్చుకుని ఇబ్బందులు పెట్టడం ఎంతవరకు సమంజసమని డీసీసీబీ మాజీ చైర్మన్‌ ముత్తవరపు పాండురంగారావు ప్రశ్నించారు. కోదాడలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు నివాసంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2015 లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున కాపుగ ల్లు పీఏసీఎ్‌సలో తాను డైరెక్టర్‌గా ఆ తరువాత డీసీసీబీ చైర్మన్‌గా ఎన్నికయ్యానన్నారు. ఈ క్రమంలో కాపుగల్లు సొసైటీలో 15వేల క్విం టాళ్ల ధాన్యం కుంభకోణం జరిగిందని తనపై కేసుపెట్టారని అదే సమయంలో మంత్రి కేటీఆర్‌, జగదీ్‌షరెడ్డి టీఆర్‌ఎ్‌సలో చేరాలని ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. తా ను ససేమిరా అంటే మంత్రి తుమ్మలతో ఒత్తిడి తెచ్చి టీఆర్‌ఎ్‌స లో చేర్చుకున్నారన్నారు. ఆ సమయంలో పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని, ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తామని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ధాన్యం కొనుగోలు కుంభకోణం కేసు ఉండదని చెప్పి ఆ హామీలను అమలు చేయకపోగా, 2017 లో మరో మారు తనపై కేసు నమోదు చేశారన్నారు. అయినా ఏ తప్పు చేయని తాను కోర్టును ఆశ్రయించానన్నారు. రూ.82లక్షల మేర రైతుల డబ్బు సివిల్‌ సప్లయి కార్పొరేషన్‌ దగ్గర ఉందని కోర్టుకు నివేదించానన్నారు. కోర్టు సూచన మేరకు ఆ డబ్బును అధికారులు రైతులకు చెల్లించారన్నారు. కుంభకోణంలో తన పాత్ర ఏముందో చెప్పాలని అన్నారు. రైతులకు అధికారులు డబ్బు చెల్లించినా, పోలీసులు తనను ఈ నెల 8న ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. పార్టీలో చేరేముందు ఒక మాట, చేరాక ఈ వేధింపులు ఏంటని అన్నారు. స్థానిక నాయకు లు దళితబంధు, రియల్‌ఎస్టేట్‌ వెంచర్లు, లిక్కర్లలో వాటాలు తీసుకుంటుంటే తానేమైనా అడిగానా అన్నారు. సొంత డబ్బు ఖర్చు చేసి పార్టీని గెలిపిస్తే ఈ వేధింపులు ఏంటని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎ్‌సగా మారినా పార్టీని నమ్ముకున్న నాయకులను, కార్యకర్తలను స్థానిక నాయులు వేధింపులకు గురిచేస్తే పార్టీపై ప్రభావం పడుతుందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర నాయకత్వం ఎమ్మెల్యేకు ఇచ్చిన స్వేచ్ఛా వాతావరణాన్ని వెనక్కి తీసుకొని పార్టీకి సేవ చేసే అందరికీ గుర్తింపు ఇవ్వాలని, అప్పుడే పార్టీ బలోపేతమవుతుందన్నారు. లేనిపక్షంలో పార్టీ పేరు మార్చినా ఒరిగేది ఏమీ ఉండదన్నారు. కాపుగల్లు పీఏసీఎ్‌సలో ఎలాంటి అక్రమాలు జరగలేదనే విషయాన్ని ప్రభుత్వంతో పాటు నియోజకవర్గ ప్రజలు గమనించాలన్నారు. తనపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా పార్టీలోనే ఉండి పోరాడుతానని స్పష్టం చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి యర్నేని వెం కటరత్నంబాబు, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి, మహబూబ్‌ జాని, వనపర్తి లక్ష్మీనారాయణ, నాగేంద్రబాబు, నాగేశ్వరరావు, గుండపనేని నాగేశ్వరరావు, సత్యనారాయణ, బండ్ల ప్రశాంతి కోటయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T00:58:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising