ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్‌ఎస్‌లో ఉంటే గంజాయి కేసులు ఉండవా?

ABN, First Publish Date - 2022-08-04T05:37:28+05:30

టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉంటే గంజాయి రవాణా కేసులు ఉండవా? అని బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షుడు గుండెపంగు రమేష్‌ ప్రశ్నించారు

సమావేశంలో మాట్లాడుతున్న బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షుడు రమేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోదాడ, ఆగస్టు 3: టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉంటే గంజాయి రవాణా కేసులు ఉండవా? అని బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షుడు గుండెపంగు రమేష్‌ ప్రశ్నించారు. బుధవారం పట్టణంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐదు రోజుల క్రితం  కోదాడకు చెందిన కొంతమంది టీఆర్‌ఎస్‌ నాయకులు తిప్పర్తి, నకిరేకల్‌ ప్రాంతాల్లో గంజాయిని తరలిస్తూ  టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు చిక్కారన్నారు. ఈ క్రమంలో నిందితులపై పోలీసులు కేసు నమోదు చేయకుండా అమాయకులైన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు  చెందిన వారిపై కేసులు నమోదు చేశారని ఆయన ఆరోపించారు. నిందితులను అరెస్టు చేసిన ఐదు రోజుల తర్వాత ఈనెల రెండో తేదీన నల్లగొండ పోలీసు కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయటంలో ఆంతర్యం ఏమిటన్నారు. క్వింటాన్నర గంజాయి పట్టుబడితే కేవలం 400కేజీలు మాత్రమే చూపించారని ఆరోపించారు. మఠంపల్లిలో ఈనెల రెండో తేదీన గంజాయి దొరికితే పోలీసులు వెంటనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారని తెలిపారన్నారు. కోదాడకు చెందిన కొంతమంది టీఆర్‌ఎస్‌ నాయకులు గంజాయి రవాణా చేస్తూ పట్టుబడినా విలేకరుల సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయకుండా కాలయాపన చేయటం వారిని కేసు నుంచి బయటపడేయటానికేనని అన్నారు. ఇప్పటికైనా గంజాయి రవాణాలో అసలు నిందితులను పోలీసులు బయటపెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఉపేందర్‌, రవికుమార్‌, రఫి, బరిగెల పుల్లయ్య, శ్రావణ్‌కుమార్‌, నాగమణి, నిర్మల, ప్రేమ్‌, నాగయ్య  పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-04T05:37:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising