ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజా అవసరాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా

ABN, First Publish Date - 2022-05-18T05:43:16+05:30

ప్రజా అవసరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని మానవ హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్‌సీ) చైర్మన్‌ జస్టిస్‌ డి.చంద్రయ్య అన్నారు. భువనగిరిలో విలేకరుల సమావేశం, మోత్కూరు పీహెచ్‌సీని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన అనంతరం ఆయన మాట్లాడా రు.

మోత్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రికార్డులు పరిశీలిస్తున్న మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ డి.చంద్రయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హెచ్‌ఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ చంద్రయ్య


మోత్కూరు, భువనగిరి రూరల్‌, మే 17: ప్రజా అవసరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని మానవ హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్‌సీ) చైర్మన్‌ జస్టిస్‌ డి.చంద్రయ్య అన్నారు. భువనగిరిలో విలేకరుల సమావేశం, మోత్కూరు పీహెచ్‌సీని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన అనంతరం ఆయన మాట్లాడా రు. చికిత్స కోసం పీహెచ్‌సీకి రోజుకు ఎంత రోగులు వస్తున్నారు, నెలకు ఎన్ని ప్రసవాలు అవుతున్నాయి, ఎంత మంది వైద్యులు పని చేస్తున్నారు, ఆపరేషన్‌ ఽథియేటర్‌ ఉందా అని ఆరా తీశారు. రోజుకు 70 నుంచి 80మంది ఔట్‌పేషం ట్లు వస్తున్నారని, ముగ్గురు వైద్యులకు ఒక్కరే ఉన్నారని, ఆపరేషన్‌ థియేటర్‌ లేదని, నెలకు 6 నుంచి 10 ప్రసవాలు చేస్తున్నామని డాక్టర్‌ చైతన్యకుమార్‌ను వివరించారు. ఆపరేషన్‌ థియేటర్‌,  గైనకాలజిస్టు, అనస్థీషియా, పీడియాట్రిస్ట్‌ అవసరమని చైర్మన్‌ దృష్టికి డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ యశోద తీసుకెళ్లారు. అదేవిధంగా పీహెచ్‌సీని 30పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేయాలని పలువురు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమస్యలను ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. హక్కులపై ప్రజ ల్లో చైతన్యం తీసుకరావాల్సిన అవసరం ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. మానవ హక్కుల కమిషన్‌కు రోజూ వందలాది ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. అన్యాయాలను వెలుగులోకి తేవాల్సిన బాధ్యత పత్రికలు, మీడియాపై ఉందన్నారు. పత్రికలు వెలుగులోకి తెచ్చిన సమస్యలపై కూడా తాము స్పందించి నోటీసులు జారీ చేస్తున్నామన్నారు. పిల్లల నిరాదరణకు గురైన తల్లిదండ్రులు ఆర్డీవోకు ఫిర్యాదు చేస్తే వారి సమస్యను పరిష్కరిస్తామన్నారు.

Updated Date - 2022-05-18T05:43:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising