ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రాణాలైనా వదులుతాం..భూములు ఇవ్వం

ABN, First Publish Date - 2022-07-02T06:09:26+05:30

ప్రభుత్వం మా దళితులకు ఇచ్చిన భూములు మాకే కావాలి, ప్రాణాలైనా వదులుతాం కానీ మా భూములను మాత్రం వదిలేది లేదని దళిత మహిళలు చెప్పారు.

భూమిలో పిచ్చిమొక్కలను తొలగిస్తున్న స్థానికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

   భూముల్లో పిచ్చి మొక్కల తొలగింపు

  మోసపూరితంగా కొనుగోలుచేశారని ఆరోపణ

  ఆలేరులో దళిత మహిళల స్పష్టీకరణ

ఆలేరు, జూలై 1: ప్రభుత్వం మా దళితులకు ఇచ్చిన భూములు మాకే కావాలి, ప్రాణాలైనా వదులుతాం కానీ మా భూములను మాత్రం వదిలేది లేదని దళిత మహిళలు  చెప్పారు. శుక్రవారం ఆలేరులోని దళితుల భూముల్లో బాధిత కుటుంబాల మహిళలు, కుటుంబ సభ్యులు, పిల్లలు తమ పట్టా భూముల్లోకి వెళ్లి కంపచెట్లు, పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల క్రితం ప్రభుత్వం పేద దళితులపైన మాకు జీవనోపాధి కోసం ఎస్సీ కార్పోరేషన ద్వారా భూములు పంపిణీ చేసింది. సర్వే నెంబర్లు, 227, 228, 234, 235, 236, 237, 238, 239లలో 135 ఎకరాల భూమిని 60 మంది పేద దళితులకు పంపిణీ చేసిందని చెప్పారు. మూడు సంవత్సరాల క్రితం అధికార పార్టీకి చెందిన ప్రస్తుత ప్రజా ప్రతినిధి తన అనుయాయులతో తమవద్దకు వచ్చి మాయ మాటలు చెప్పితక్కువ ధరలకు కొనుగోలు చేశారని తెలిపారు. ఎనవోసీ ఇప్పిస్తామని చెప్పి మోసం చేసి, రిజిస్ర్టేషన్లు, చేయించుకున్నారని ఆరోపించారు. ఎస్సీలకు ఇచ్చిన భూములకు ఎనవోసీ ఇచ్చిన అధికారులను, మాయమాటలు చెప్పి అమాయకులమైన తమను  మోసం చేసిన వారిని శిక్షించాలని డిమాండ్‌ చేశారు. భూములు తమకు దక్కేంత వరకు కొట్లాడతామని అన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్‌, ఎల్లయ్య, లక్ష్మీ, నర్సమ్మ, యాదగిరి, రామక్క, బాలమ్మ, రేణుక ఉన్నారు.  

Updated Date - 2022-07-02T06:09:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising