కాంగ్రె్‌సకు పూర్వ వైభవం తెస్తాం
ABN, First Publish Date - 2022-12-15T00:18:12+05:30
జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిధి గృహంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
నల్లగొండ, డిసెంబరు 14: జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిధి గృహంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ శ్రేణులందరి సహకారంతో టీపీసీసీ తనకు రెండో సారి డీసీసీ అధ్యక్షుడిగా అవకాశం కల్పించిందన్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి కృత్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయమన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తారన్నారు. కాంగ్రె్‌సను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు ప్రజలకు మోసపూరిత హామీలిచ్చి పాలన సాగిస్తున్నాయని విమర్శించారు. ఈ రెండు ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని అన్నారు. కేసీఆర్ పాలన నిజాం నిరంకుశత్వాన్ని తలపిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వాలకు పతనం తప్పదని హెచ్చరించారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే ఆందోళనల్లో పార్టీ శ్రేణులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం కలెక్టరేట్‌లో కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. జిల్లాలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కోట శ్రీనివా్‌సరావు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-15T00:18:14+05:30 IST