ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి హరీష్‌రావు పర్యటనను అడ్డుకుంటాం

ABN, First Publish Date - 2022-05-20T06:46:39+05:30

జిల్లా ఆసుపత్రి, పట్టణ అభివృద్ధిపై గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి విస్మరించడాన్ని నిరసిస్తూ శుక్రవారం భువనగిరిలో జరిగే వైద్య ఆరోగ్య, ఆర్థికశాఖ మంత్రి టి.హరీష్‌రావు పర్యటనను అడ్డుకుంటామని బీజేపీ జిల్లా అధ్య క్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు అన్నారు.

మాట్లాడుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనగిరి టౌన్‌, మే 19: జిల్లా ఆసుపత్రి, పట్టణ అభివృద్ధిపై గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి విస్మరించడాన్ని నిరసిస్తూ శుక్రవారం భువనగిరిలో జరిగే వైద్య ఆరోగ్య, ఆర్థికశాఖ మంత్రి టి.హరీష్‌రావు పర్యటనను అడ్డుకుంటామని బీజేపీ జిల్లా అధ్య క్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు అన్నారు. గురువారం భువనగిరిలో నిర్వ హించిన బీజేపీ పట్టణ శాఖ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా ఆసుపత్రి అభివృద్ధికి ఎమ్మెల్యే ఇచ్చిన ఏ ఒక్క హమీని నేటికీ నెరవేరలేదన్నారు. జిల్లా ఆసుపత్రిలో పూర్తి స్థాయి సిబ్బందిని భర్తీ చేయాలని, నైట్‌ డ్యూటీ డాక్టర్స్‌ను పెంచాలన్నారు. సమ స్యలకు నిలయంగా మారిన పట్టణంలో  టీఆర్‌ఎస్‌ నాయకులు పాద యాత్ర చేయడం సిగ్గుచేటన్నారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు పాదరాజు ఉమాశంకర్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నర్ల నర్సింగ్‌రావు, మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ మాయ దశరథ, కౌన్సిలర్లు రాశేష్‌, జనగాం కవిత, రత్నపురం బలరాం  పాల్గొన్నారు. 



Updated Date - 2022-05-20T06:46:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising