ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చర్లగూడెం నిర్వాసితులకు అండగా ఉంటాం

ABN, First Publish Date - 2022-10-11T06:43:22+05:30

చర్లగూడెం రిజర్వాయర్‌ కారణంగా భూములు కోల్పోయిన నిర్వాసితులకు బీజేపీ అండగా ఉంటుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అన్నారు.

నిర్వాసితులకు సంఘీభావం తెలుపుతున్న బండి సంజయ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌


మర్రిగూడ, అక్టోబరు 10: చర్లగూడెం రిజర్వాయర్‌ కారణంగా భూములు కోల్పోయిన నిర్వాసితులకు బీజేపీ అండగా ఉంటుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అన్నారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా చర్లగూడెం రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన రైతులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్రత్యేక ప్యాకేజీ అందించాలని మర్రిగూడ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఖుదాభక్ష్‌పల్లి, శివన్నగూడ, రాంరెడ్డిపల్లి, అజిలాపురం గ్రామాల రైతులు చేస్తున్న దీక్ష సోమవారం 40వ రోజుకు చేరుకుంది. దీక్షా శిబిరాన్ని బండి సంజయ్‌ సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, శివన్నగూడ రిజర్వాయర్‌లో ముంపునకు గురై భూములు కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయంచేసేంత వరకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతులు న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేస్తున్న నిరాహార దీక్షకు ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. చర్లగూడెం రిజర్వాయర్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేసిన సమయంలో నిర్వాసితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఈనెల 15న భూములు కోల్పోయిన బాధిత రైతులతో కలిసి ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు. ఆయన నిర్వాసితులు నర్సింహ, యాదగిరి, ఉన్నారు.

Updated Date - 2022-10-11T06:43:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising