ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భాగ్యరెడ్డివర్మ చూపిన మార్గంలో పయనించాలి

ABN, First Publish Date - 2022-05-23T07:27:17+05:30

ప్రముఖ సంఘ సంస్కర్త, దళితజాతి వైతాళికుడ భాగ్యరెడ్డివర్మ చూపిన మార్గంలో అందరు పయనించాలని ఆర్డీవో రాజేంద్రకుమార్‌ అన్నారు. భాగ్యరెడ్డివర్మ జయంతిని జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు.

భాగ్యరెడ్డివర్మ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న కలెక్టరేట్‌ సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, మే 22: ప్రముఖ సంఘ సంస్కర్త, దళితజాతి వైతాళికుడ భాగ్యరెడ్డివర్మ చూపిన మార్గంలో అందరు పయనించాలని ఆర్డీవో రాజేంద్రకుమార్‌  అన్నారు. భాగ్యరెడ్డివర్మ జయంతిని జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్‌లో భాగ్యరెడ్డివర్మ చిత్రపటానికి ఆర్డీవో పూలమా లలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారులు దయానందరాణి, శంకర్‌, శ్యాం పాల్గొన్నారు.  సూర్యాపేటలో నిర్వహించిన భాగ్యరెడ్డివర్మ జయంతి  కార్యక్రమంలో  మాల మహానాడు రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు తల్లమల్ల హస్సేన్‌,  మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు ఎర్రమల్ల రాములు పాల్గొ న్నారు.  నూతన్‌కల్‌  తాహసీల్దార్‌ కార్యాలయంలో భాగ్యరెడ్డివర్మ చిత్రపటానికి డిప్యూటీ తాహసీల్దార్‌ శ్రీధర్‌నాయక్‌, అధికారులు నివాళులర్పించారు. కోదాడలో భాగ్యరెడ్డివర్మ చిత్రపటానికి ఎంపీపీ చింతా కవితా రాధారెడ్డి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో విజయశ్రీ, సూపరింటెండెంట్‌ వెంకన్న పాల్గొన్నారు. నేరేడుచర్లలోని మండల పరిషత్‌ కార్యాలయంలో,  మునిసిపాలిటీ కార్యాలయంలో భాగ్యరెడ్డివర్మ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీవో విజయకుమారి, కమిషనర్‌ వెంకటేశ్వర్లు, వైస్‌ చైర్మన్‌,  శ్రీలతారెడ్డి, ఏపీవో శేఖర్‌, మోతె మండల పరిషత్‌ కార్యాలయంలో భాగ్యారెడ్డివర్మ చిత్రపటానికి ఎంపీడీవో కే.శంకర్‌రెడ్డి, ఎంపీవో హరి సింగ్‌ నాయక్‌, ఎంపీపీ గూడెపు శ్రీనివాసు నివాళులర్పించారు. కార్యక్రమంలో నర్సిరెడ్డి, చంద్రకళ, ప్రసాద్‌, భాస్కర్‌, సాయిలక్ష్మి, సాయి, నరేందర్‌ పాల్గొన్నారు. 



Updated Date - 2022-05-23T07:27:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising