ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హమాలీలకు కూలి పెంచాలి

ABN, First Publish Date - 2022-05-24T07:41:57+05:30

పెరుగు తున్న ధరలకు అనుగుణంగా హమాలీలకు కూలి పెంచాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్‌, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్‌ మోత్కూరులో సీపీఐ మండల కార్యదర్శి అన్నెపు వెంకట్‌, ఏఐటీ యూసీ మండల అధ్యక్షుడు జంగ నర్సయ్య డిమాండ్‌ చేశారు.

భువనగిరి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్న హమాలీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనగిరి రూరల్‌, ఆలేరు రూరల్‌, మోత్కూరు, మే 23: పెరుగు తున్న ధరలకు అనుగుణంగా హమాలీలకు కూలి పెంచాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్‌, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్‌ మోత్కూరులో సీపీఐ మండల కార్యదర్శి అన్నెపు వెంకట్‌, ఏఐటీ యూసీ మండల అధ్యక్షుడు జంగ నర్సయ్య డిమాండ్‌ చేశారు. కూలీ పెంచా లని పౌర సరఫరాల శాఖలో పనిచేస్తున్న కార్మికులు సోమవారం పలు తహసీ ల్దార్ల కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. భువనగిరిలో నిర్వహించిన ధర్నాలో ఇమ్రాన్‌, ఆలేరులో వెంకటేష్‌, మోత్కూరులో నిర్వహించిన ధర్నాలో వెంకట్‌, జంగయ్య మాట్లాడారు. గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం డిసెంబరు 2021తో గడువు ముగిసిన నేపథ్యంలో వెంటనే కూలి క్వింటాల్‌కు రూ.23పెంచాలని, సొంత గోదాం నిర్మించడానికి స్థలం కేటాయించాలని, రూ.10వేల బోనస్‌ ఇవ్వా లని, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు భువనగిరి, ఆలేరు, మోత్కూరులో తహసీల్దార్లు కె.వెంకట్‌రెడ్డి, గణేష్‌, ఎస్‌కే అహ్మద్‌కు  వినతిపత్రం ఇచ్చారు.  కార్యక్రమంలో ఎం.బసవయ్య, పి.అంజయ్య, సత్తయ్య, శ్రీను, రాజు, జహంగీర్‌, పరశురాములు, గణేశ్‌, కృష్ణ, పల్లె శ్రీనివాస్‌, సత్యనారాయణ, వీరయ్య, శ్రీను, సుహాస్‌, సిద్దులు, వెంకటేష్‌,  పి.మల ్లయ్య, పి.రమేష్‌, జె.మహేష్‌, అనిల్‌, శ్రీనివాస్‌, కృష్ణ పాల్గొన్నారు.



Updated Date - 2022-05-24T07:41:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising