ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పల్లె టు పట్నం

ABN, First Publish Date - 2022-01-18T06:00:34+05:30

సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో స్వగ్రామాలకు వెళ్లిన ప్రజలు పల్లెను వీడి పట్నం బాటపట్టారు. దీంతో జాతీయ రహదారులు వాహనాలతో కిటకిటలాడాయి.

చౌటుప్పల్‌ మండలంలోని పంతంగి టోల్‌ ప్లాజా వద్ద బారులు తీరిన వాహనాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కిటకిటలాడిన జాతీయ రహదారులు

చౌటుప్పల్‌ రూరల్‌/బీబీనగర్‌, జనవరి 17: సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో స్వగ్రామాలకు వెళ్లిన ప్రజలు పల్లెను వీడి పట్నం బాటపట్టారు. దీంతో జాతీయ రహదారులు వాహనాలతో కిటకిటలాడాయి. సోమవారం నుంచి ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు ప్రారంభంకావడం తో ప్రజలు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు పయనమయ్యా రు. కార్లు, బస్సుల్లో బయలుదేరారు. దీంతో విజయవాడ-హైదరాబాద్‌, వరంగల్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారులు వా హనాలతో కిటకిటలాడాయి. ఫలితంగా నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్‌, చౌటుప్పల్‌ మండలంలోని పంతంగి, బీబీనగర్‌ మండలంలోని గూడూరు టోల్‌ గేట్ల వద్ద వాహనాల రద్దీ నెలకొంది. పంతంగి వద్ద 16 గేట్లకు 10 గేట్లను హైదరాబాద్‌ వైపునకు వెళ్లే వాహనాలకు కేటాయించారు. ఇక్కడి నుంచి తిరుగు ప్రయాణికులతో 47వేల వాహనాలు రాకపోకలు సాగించాయి.   గూడూరు టోల్‌ప్లాజా వద్ద 12గేట్లకు ఆరు గేట్లను హైదరాబాద్‌ వైపునకు వెళ్లే వాహనాలకు కేటాయించారు. సుమారు 21వేల వాహనాలు ఈ టోల్‌ప్లాజా మీదుగా రాకపోకలు సాగించాయి.

Updated Date - 2022-01-18T06:00:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising