ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జోరుగా యాసంగి వరి నాట్లు

ABN, First Publish Date - 2022-12-15T01:22:30+05:30

రైతలు యాసంగి వరి సాగు పనుల్లో తలమునకలై ఉన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో కాలువలు, చెరువులు, కుంటలు, బావులు, బోర్ల కింద వరినాట్లు పనులు జోరుగా సాగుతున్నాయి. సాగర్‌ కాలువ రావడం, భూగర్భ నీటి మట్టం పెరగడంతో వరి సాగు విస్తీర్ణం పెరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకవీడు, డిసెంబరు 14: రైతలు యాసంగి వరి సాగు పనుల్లో తలమునకలై ఉన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో కాలువలు, చెరువులు, కుంటలు, బావులు, బోర్ల కింద వరినాట్లు పనులు జోరుగా సాగుతున్నాయి. సాగర్‌ కాలువ రావడం, భూగర్భ నీటి మట్టం పెరగడంతో వరి సాగు విస్తీర్ణం పెరిగింది. యాసంగి సీజన్‌లో కూలీలతో వరి నాట్లకు బదులు డ్రమ్‌సీడర్‌తో విత్తనాలు వెదజల్లే పద్ధతి వైపు మండలంలోని 70శాతం మంది రైతులు మొగ్గుచూపుతున్నారు. నీటి వసతి లేని ప్రాంతాల్లో రైతులు పత్తిని సాగు చేస్తు న్నారు. వరి నాట్లతో మహిళా కూలీలు ఉపాధి పొందు తున్నారు. మరికొందరు మహిళా కూలీలు ఉపాధి కోసం ఆటోలు, ట్రాక్టర్లలో ఇతర గ్రామాలకు వెళుతున్నారు. మండలంలోని మొత్తం 21వేల ఎకరాల భూమి ఉంది. ఇందులో సేద్యానికి అనుకూలంగా 15వేల ఎకరాల భూమి ఉండగా, 12,500ఎకరాల్లో వరిని సాగు చేస్తున్నారు. మిలిగిన భూమిలో పత్తి, ఇతర పంటలు సాగు చేసు ్తన్నారు. యాసంగి పనులు ప్రారంభమైనా ‘రైతు బంఽధు’ డబ్బులు ఖాతాల్లో జమ కానందున రైతులు ఎదురు చూస్తున్నారు.

‘రైతు బంధు’ నగదును జమచేయాలి

ఇటీవల కురిసిన వర్షాలకు సాగర్‌ డ్యామ్‌ నిండి నిండు కుండలా ఉంది. మండలంలోని రైతులు వరి నాట్లు, పత్తి పనుల్లో నిమగ్నమయారు. రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు బంధు’ పథకం నిధులను వెంటనే ఖాతాల్లో జమ చేయాలి.

నాగిరెడ్డి, రైతు

Updated Date - 2022-12-15T01:22:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising