ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైన్‌ స్నాచింగ్‌లు చేస్తున్న ఇద్దరి అరెస్టు

ABN, First Publish Date - 2022-06-30T08:09:27+05:30

చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను కోదాడ పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలోని డీఎస్పీ కార్యా లయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేంద్ర ప్రసాద్‌ కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం వెల్లడించారు.

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ రాజేంద్రప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

13తులాల బంగారం , రెండు బైకులు స్వాధీనం

కోదాడ, జూన్‌ 29: చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను కోదాడ పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలోని డీఎస్పీ కార్యా లయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేంద్ర ప్రసాద్‌ కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం వెల్లడించారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా బైక్‌పై వెళ్తున్న ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలోని కొత్త కాచారం గ్రామానికి చెందిన చేలూరి వెంకటేష్‌, ఏపీ రాష్ట్రం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని తిరుమలగిరి గ్రామానికి చెందిన ఆలూరి నవీన్‌కుమార్‌పై అనుమానం రావడంతో పోలీసులు బైక్‌ ఆపారు. డాక్యుమెంట్స్‌ను ఇవ్వాలని అడిగారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారించారు. ఈ క్రమంలో ఖమ్మంలోని ఖానాపురం, కోదండ పరిధిలోని ఐదు చైన్‌ స్నాచింగ్‌ దొంగ తనాలు చేసినట్లు వారు విచారణలో ఒప్పుకున్నారని ఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి 13తులాల బంగారం, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేసి ఇద్దరిని రిమాండ్‌కు తరలించామన్నారు. సమావేశంలో డీఎస్పీ  వెంకటేశ్వర్‌రెడ్డి, సీఐ నర్సింహా రావు, ఎస్‌ఐ నాగభూషణ్‌రావు, రాంబాబు పాల్గొన్నారు.    



Updated Date - 2022-06-30T08:09:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising