ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విష వాయువు కలకలం

ABN, First Publish Date - 2022-01-21T07:30:26+05:30

భూదాన్‌పోచంపల్లి మునిసిపాలిటీ కేంద్రంలోని ఆరు కాలనీల్లో విషవాయువు కలకలం రేపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఘాటైన వాసనతో ప్రజల ఇబ్బందులు 

 భూదాన్‌పోచంపల్లిలో ఘటన

భూదాన్‌పోచంపల్లి, జనవరి 20: భూదాన్‌పోచంపల్లి మునిసిపాలిటీ కేంద్రంలోని ఆరు కాలనీల్లో విషవాయువు కలకలం రేపింది. భావనారుషిపేట, లక్ష్మణ్‌నగర్‌కాలనీ, సిల్కుసిటీ పోచంపల్లి, మాధవనగర్‌కాలనీ, రాజీవ్‌నగర్‌కాలనీల్లో సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 9గంటల వరకు గాలిలో విషవాయువు రావడంతో కాలనీల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఘాటైన వాసనతో ఊపిరి పీల్చుకునేందుకు కూడా ఇబ్బంది పడ్డారు. భూదాన్‌పోచంపల్లి మునిసిపాలిటీ పరిధిలోని నారాయణగిరి ప్రాంతంలోని కెమికల్‌ కంపెనీతోపాటు, దోతిగూడెం అంత్మగూడెం గ్రామాల్లోని కెమికల్‌ కంపెనీలు గాలిలోకి  వదిలే విషవాయువులతో పట్టణ ప్రజలు తరుచూ ఇబ్బందులు పడుతున్నారు. వారంలో రెండుసార్లు విష వాయువులు పీల్చలేక తాము ఇబ్బందులు పడుతున్నామని, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని స్థానికుడు చింతకింది కిరణ్‌ తెలిపాడు. కెమికల్‌ కంపెనీలపై కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.   

Updated Date - 2022-01-21T07:30:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising