ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బుద్ధవనంలో పర్యాటకుల సందడి

ABN, First Publish Date - 2022-06-27T07:14:53+05:30

నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీలో ఉన్న బుద్ధవనంలో ఆదివారం పర్యాటకుల సం దడి నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్య లో పర్యాటకులు బుద్ధవనాన్ని సందర్శించారు.

పర్యాటకులకు బుద్ధవనం విశేషాలను వివరిస్తున్న బౌద్ధ విశ్లేషకులు డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొనసాగుతున్న ధ్యాన శిక్షణ తరగతులు

నాగార్జునసాగర్‌, జూన్‌ 26: నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీలో ఉన్న బుద్ధవనంలో ఆదివారం పర్యాటకుల సం దడి నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్య లో పర్యాటకులు బుద్ధవనాన్ని సందర్శించారు. బుద్ధవనంలో బుద్ధచరిత వనం, జాతక వనం, స్తూప వనం, మహాస్తూపం, బుద్ధుని పాదాలను పర్యాటకులు ఆసక్తిగా తిలకించారు. బుద్ధవనం విశేషాలను బౌద్ధ విశ్లేషకులు డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి పర్యాటకులకు వివరించారు. 


ధ్యాన శిక్షణ తరగతులకు విశేష స్పందన : లక్ష్మయ్య 

తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సాగర్‌ హిల్‌కాలనీలో నిర్మించిన బుద్ధవనంలో ప్రతి ఆదివారం నిర్వహించే ధ్యాన తరగతులకు విశేష స్పందన లభిస్తుందని బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు. బుద్ధవనం ప్రాజెక్టులో ధమ్మ నాగార్జున విపశ్యన ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహిస్తుమన్నారు. ధ్యాన శిక్షణ తరగతులకు 100 మంది హాజరైనట్లు ఆయన తెలిపారు. శిక్షణ తరగతులకు సాగర్‌తో పాటు హాలియా, మిర్యాలగూడ, నల్లగొండ, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తున్నట్లు లక్ష్మయ్య పేర్కొన్నారు.

Updated Date - 2022-06-27T07:14:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising