ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి రవాణా బంద్‌ను విజయవంతం చేయాలి

ABN, First Publish Date - 2022-05-19T07:20:18+05:30

నేడు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే రవాణా బంద్‌ను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల నాయకులు కొలిశెట్టి యాదగిరిరావు, వెంపటి గురూజీ, సాగర్‌రెడ్డి కోరారు.

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న కార్మిక సంఘాల నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట అర్బన్‌, మే 18: నేడు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే రవాణా బంద్‌ను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల నాయకులు కొలిశెట్టి యాదగిరిరావు, వెంపటి గురూజీ, సాగర్‌రెడ్డి కోరారు. బుధవారం జిల్లా కేంద్రంలోని లారీ అసోసియేషన్‌ కార్యాలయంలో తెలంగాణ ఆటో, క్యాబ్‌, డీసీఎం, లారీ సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే రవాణా బంద్‌ కరపత్రాలు ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్రం పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో నిత్యావసర వస్తువులను సామాన్య ప్రజలు కొనలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. వాహనాల ఫిట్‌నెస్‌ రెన్యూవల్‌ అయిన తర్వాత రోజుకు రూ.50 చొప్పున జరిమానా విధిస్తూ జీవో నెం.714 తీసుకురావడం దారుణమన్నారు. తక్షణమే ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం 2019లో రోడ్డు రవాణా భద్రత బిల్లు తీసుకురావడంతో రవాణా రంగ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌, ఓవర్‌ లోడ్‌, ఇతర పేర్లతో భారీ చలానాలు విధిస్తుండడంతో కార్మికుల బతుకులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో నాయకులు కుర్రి సైదులు, అహ్మద్‌  రాంబాబు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-19T07:20:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising