ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మునుగోడులో బీసీలకు టికెట్‌ ఇవ్వాలి

ABN, First Publish Date - 2022-09-19T06:05:52+05:30

త్వరలో జరగబోయే మునుగోడు ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీ బీసీ అభ్యర్థికి టికెట్‌ కేటాయించాలని, లేదంటే ఆ పార్టీకి బీసీలంతా తగి న బుద్ధి చెబుతారని బీసీ పొలిటికల్‌ జేఏసీ జేఎసీ చైర్మన్‌ రాచాల యుగేంధర్‌గౌడ్‌ అన్నా రు. ఆదివారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఏ పార్టీ కూడా బీసీలకు టికెట్‌ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బీసీ పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ యుగేంధర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీసీ పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ యుగేంధర్‌ 

నల్లగొండ టౌన్‌, సెప్టెంబరు 18: త్వరలో జరగబోయే మునుగోడు ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీ బీసీ అభ్యర్థికి టికెట్‌ కేటాయించాలని, లేదంటే ఆ పార్టీకి బీసీలంతా తగి న బుద్ధి చెబుతారని బీసీ పొలిటికల్‌ జేఏసీ జేఎసీ చైర్మన్‌ రాచాల యుగేంధర్‌గౌడ్‌ అన్నా రు. ఆదివారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఏ పార్టీ కూడా బీసీలకు టికెట్‌ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. నియోజకవర్గంలో 70శాతానికిపైగా బీసీ ఓట్లున్నాయని, అయినా అన్ని రాజకీయ పార్టీలు బీసీలను పట్టించుకోవడంలేదన్నారు. బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోల దీపేందర్‌ మాట్లాడుతూ ఎనిమిదేళ్ల పాలనలో సీఎం కేసీఆర్‌ బీసీలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. కులవృత్తులు కుంటుపడడంతో బీసీల బతుకులు రోడ్డున పడ్డాయన్నారు. కార్యక్రమంలో బీసీ సంఘం నియోజకవర్గ ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు ఎలిజాల రమేష్‌, ఉపాధ్యక్షుడు కంబాలపల్లి అనిల్‌, బోళ్ల నాగరాజు, మధు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-09-19T06:05:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising