ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నడిగూడెంలో దాహం..దాహం

ABN, First Publish Date - 2022-12-08T01:21:17+05:30

నడిగూడెం మండల కేంద్రంలోని తొమ్మిదో వార్డులో మంచినీటికి కటకట ఏర్పడింది.

ట్యాంకర్‌ ద్వారా ఇంటింటికీ నీటిని సరఫరా చేస్తున్న పంచాయతీ సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నడిగూడెం, డిసెంబరు 7: మండల కేంద్రంలోని తొమ్మిదో వార్డులో మంచినీటికి కటకట ఏర్పడింది. నాలుగు రోజుల క్రితం లోవోల్టేజీతో గ్రామపంచాయతీ బోరు మోటారు కాలిపోయింది. మోటర్‌కు మరమ్మతు చేయించకపోవడంతో సరఫరా నిలిచిపోయింది. దీంతో మంచినీటి ఎద్దడి ఏర్పడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేయడంతో సర్పంచ్‌ గడ్డం నాగలక్ష్మీమల్లే్‌షయాదవ్‌ పంచాయతీ ట్యాంకర్‌ ద్వారా ఇంటింటికీ మంచినీటిని సరఫరా చేస్తున్నారు. ట్యాంకర్‌ ద్వారా అందించే నీరు అవసరాలకు సరిపోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. విద్యుత్‌ లోవేల్టేజీ సమస్యతో మోటర్లు తరుచూ కాలిపోయి మంచినీటి సమస్య ఏర్పడుతోందని,గ్రామానికి ప్రత్యేకంగా ట్రాన్స్‌ఫార్మర్‌ మంజూరు చేయాలని గ్రామస్థులు కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ కొత్త మోటారు అమర్చి వార్డులో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు.

Updated Date - 2022-12-08T01:21:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising