ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్కన్న మాదన్న ఆలయంలో చోరీ

ABN, First Publish Date - 2022-08-23T06:22:26+05:30

మండలంలోని మహదేవ్‌పూర్‌లోని చారిత్రక నేపథ్యం కలిగిన అక్కన్నమాదన్న ఆలయంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో చోరీ జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




బీబీనగర్‌, ఆగస్టు 22 : మండలంలోని మహదేవ్‌పూర్‌లోని చారిత్రక నేపథ్యం కలిగిన అక్కన్నమాదన్న ఆలయంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఎస్‌ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం వేణుగోపాలస్వామి ఆలయంలోకి ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నిక్కర్లు ధరించిన ఇద్దరు ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించారు. స్వామివారి, అమ్మవార్లకు చెందిన విలువైన వెండి ఇత్తడి కిరీటాలతో పాటు ఇతర ఆభరణాలను అపహరించారు. అనంతరం హుండీని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా ఆలయంలో ఏర్పాటు చేసి సీసీ కెమెరాలో దొంగతనం దృష్యాలు రికార్డు అవుతున్నాయి. అయితే సీసీ కెమెరాలు ఆలయంలో పనిచేస్తే అటెండర్‌ భాస్కర్‌రెడి మొబైల్‌ఫోనకు లింక్‌ చేసి ఉండడంతో ఆలయంలో జరిగే దృశ్యాలన్ని మెబైల్‌ ఫోనలో కనిపిస్తుంటాయి. దొంగతనం జరుగుతున్న సమయంలో పోచంపల్లిలో అత్తగారి ఇంట్లో ఉన్న అటెండర్‌ భాస్కర్‌రెడ్డి అర్థరాత్రి ఒంటి గంటకు నిద్రలేచిన సమయంలో తన  ఫోన ఆన చేసి ఆలయంలోని సీసీకెమెరాల దృశ్యాలను పరిశీలిస్తుండగా దొంగలు చొరబడి హుండీని ఎత్తుకెళ్తున్న దృశ్యాలు గుర్తించాడు. వెంటనే గ్రామస్థులకు ఫోన చేసి అప్రమత్తం చేయడంతో గ్రామస్థులు గుంపుగా ఆలయం వద్దకు పరుగెత్తారు. అప్పటికే ఆలయ ప్రధాన ద్వారం తొలగించి పరారయ్యారు. వెంటనే ఆలయ పరిసరాలలో గాలింపు చేపట్టగా వంద మీటర్ల దూరంలో హుండీని గ్రామస్థులు గుర్తించారు. హుండీ యధావిధిగా ఉండడంతో గ్రామస్థుల అలజడి విని హుండీని పగులగొట్టకుండా వదిలేని పారిపోయి ఉంటారని గ్రామస్థులు భావిస్తున్నారు. ఈ ఘటనపై ఆలయ ఈవో వెంకటేష్‌ పోలీసులకు ఫిర్యా దు చేయడంతో ఎస్‌ఐ సైదులు ఘటనా స్థలానికి చేరుకొని పరిసరాలను ప రిశీలించారు. డాగ్‌ స్క్వాడ్‌ను రప్పించి ఆధారాల కోసం పరిసరాలలో తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని సీసీ కెమెరాలలో రికార్డు అయిన పుటేజీల ఆధారంగా దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తామని ఎస్‌ఐ సైదులు తెలిపారు. 


Updated Date - 2022-08-23T06:22:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising