ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్య కళాశాల పనులు ముమ్మరం

ABN, First Publish Date - 2022-09-04T05:50:40+05:30

జిల్లాకు ఎంతో ప్రతిష్టను పెంచే మెడికల్‌ కళాశాల భవన నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి.

మెడికల్‌ కళాశాలకు పిల్లర్లు వేసిన దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చురుకుగా సాగుతున్న నిర్మాణ పనులు 

నల్లగొండ అర్బన, సెప్టెంబరు 3: జిల్లాకు ఎంతో ప్రతిష్టను పెంచే  మెడికల్‌ కళాశాల భవన నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. జి ల్లా కేంద్రంలోని సాగర్‌ రోడ్డు ఎస్‌ఎల్‌బీసీ ప్రాంతంలో సుమారు 42 ఎకరాల సువిశాల స్థలంలో మెడికల్‌ కళాశాల నిర్మాణ పనులు జరుగుతున్నా యి. జిల్లాకు 2019లో మెడికల్‌ కళాశాల మంజూరైంది. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రిలో అరకొర వసతులతోనే మెడికల్‌ కళాశాల కొనసాగుతుంది. సరై న భవనాలు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటూ వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీ్‌షరావు ఆస్పత్రి ఆకస్మిక తనిఖీకి వచ్చినప్పుడు మెడికల్‌ విద్యార్థులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా సరైన భవన సముదాయాలు లేకపోవడం, లెక్చరర్‌ గ్యాలరీలు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని విద్యను అభ్యసించలేకపోతున్నామని విద్యార్థులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తక్షణమే స్పందించిన మంత్రి వెంటనే మెడికల్‌ కళాశాల నిర్మాణ పనులు చేపట్టాలని అప్పటి కలెక్టర్‌ రాహుల్‌శర్మకు ఆదేశాలు జారీ చేయడంతో కాంట్రాక్టర్‌ పనులు ప్రారంభించారు. సూర్యాపేట, నల్లగొండకు ఒకేసారి మెడికల్‌ కళాశాల మంజూరైనప్పటికీ సూర్యాపేటలో మాత్రం భవన నిర్మాణం పూర్తి చేసుకు ని విద్యార్థులకు అందుబాటులోకి వచ్చింది. నల్లగొండలో భవన నిర్మాణా నికి శంకుస్థాపన చేసి పనులు చేపట్టారు. నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రూ.117కోట్లతో నాలుగంతస్థుల భవన నిర్మాణం, మరో రూ.30 కోట్లతో వైద్య పరికరాలు, విద్యార్థిని విద్యార్థులకు హాస్టల్‌ సముదాయాలు నిర్మించనున్నారు. ఇతరత్రా పనుల కోసం కేటాయించారు. మెడికల్‌ కళాశాలకు అనుగుణంగా మరో 5 ఎకరాల్లో రూ.40 కోట్లతో నాలుగు ఫ్లోర్లతో నర్సింగ్‌ కళాశాలను నిర్మించనున్నారు. మెడికల్‌ కళాశాల నిర్మాణ పనులు రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాల్సి ఉంది.


Updated Date - 2022-09-04T05:50:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising