ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN, First Publish Date - 2022-01-21T06:44:08+05:30

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ అన్నారు. గురువారం తిరుమలగిరి మునిసిపాలిటీ పరిధిలో రూ.17.6 లక్షల వ్యయంతో నిర్మించనున్న బీసీ హాస్టల్‌ ప్రహరీకి శంకుస్థాపన చేశారు.

నందాపురంలో ఎస్సీ కమ్యూనిటీహాల్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కిషోర్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే కిషోర్‌కుమార్‌

తిరుమలగిరి, జనవరి 20: అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ అన్నారు. గురువారం తిరుమలగిరి మునిసిపాలిటీ పరిధిలో రూ.17.6 లక్షల వ్యయంతో నిర్మించనున్న బీసీ హాస్టల్‌ ప్రహరీకి శంకుస్థాపన చేశారు. నందాపురంలో రూ.10.5లక్షల వ్యయంతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీహాల్‌ను, తిరుమలగిరిలో చర్చిని ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సీఎం కేసీఆర్‌ ముందుకు తీసుకువెళుతూ కొత్త శకానికి నాంది పలికారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నెమురు గొమ్ముల స్నేహలత, మార్కెట్‌ చైర్మన్‌ మూల అశోక్‌రెడ్డి,  కమి షనర్‌ దండు శ్రీను, కౌన్సిలర్లు బత్తుల శ్రీను, కన్నెబోయిన రేణుక, పీఏసీఎస్‌ చైర్మన్‌ పాలెపు చంద్రశేఖర్‌, తిరుమని యాద గిరి, కందుకూరి లక్ష్మయ్య, మూల వెంకట్‌రెడ్డి, పాష, సందీప్‌ నేత, బాబు తదితరులు పాల్గొన్నారు.

తిరుమలగిరి రూరల్‌: పల్లెలను అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ అన్నారు. మండలంలోని తొండ, చింతలకుంట తండ, వెలిశాల, మర్రి కుంటతండా, గుండెపురి, కేఆర్‌కే తండా, బండ్లపల్లి, గ్రామాల్లో వైకుంఠధామాలను వెలిశాల, మామిడాల గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను ప్రారంభించారు. తాటిపాముల గ్రామంలోని ఉన్నత పాఠశాల ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్‌, ఎంపీపీ స్నేహలత, జడ్పీటీసీ అంజలిరవీందర్‌, వైఎస్‌ ఎంపీపీ సుజాతసైదులు, సర్పంచ్‌లు దేవానాయక్‌, వీరయ్య, కర్ణాకర్‌ రవి, రేణుక, వెంకన్న, శ్రీను, సోమలక్ష్మి, అంజయ్య, శాతవాహనరావు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-01-21T06:44:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising