ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ ఉపాధ్యాయుడి కిరాతకం

ABN, First Publish Date - 2022-05-21T06:25:42+05:30

అతనో ఉపాధ్యాయుడు.. పాఠాలు చెప్పి విద్యార్థులను ప్రయోజకులను చేయాల్సిన అతనే ఓ భూవివాదంలో సుపారీ ఇచ్చి బంధువునే హ

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ రాజేంద్రప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 భూవివాదంలో బంధువును హత్య చేయించిన వైనం

 జనార్ధన్‌రెడ్డి హత్య సుపారికీ రూ.10లక్షలు 

 హోంగార్డు ద్వారా సుపారీ  

 ఎస్పీ రాజేంద్రప్రసాద్‌

మునగాల, మే 20: అతనో ఉపాధ్యాయుడు.. పాఠాలు చెప్పి విద్యార్థులను ప్రయోజకులను చేయాల్సిన అతనే ఓ భూవివాదంలో సుపారీ ఇచ్చి బంధువునే హత్య చేయించాడు. దీనితో పాటు రెండు హత్యలకు సం బంధించిన కేసులతో ఆయనకు సంబంధం ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. శుక్రవారం పోలీ్‌సస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ కొంతకాలంగా కొనసాగుతున్న భూవివాదం నేపథ్యంలో ఇటీవల మోతె మండల కేంద్రంలో పగడాల జనార్ధన్‌రెడ్డిని హత్య చేయించిన పగడాల గిరిధర్‌రెడ్డి, సయ్యద్‌ సయీద్‌, సయ్యద్‌ నదీం, తంగిరాల రాంబాబులను అరెస్టు చేశామన్నారు. మండల కేంద్రానికి చెందిన పగడాల జనార్ధన్‌రెడ్డి, పగడాల గిరిధర్‌రెడ్డి మధ్య కొంతకాలంగా భూమి, బాట గెట్ల పంచాయితీ నడుస్తోంది. దీనిని మనసులో పెట్టుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు పగడాల గిరిధర్‌రెడ్డి, తన పాలివాడైన జనార్ధన్‌రెడ్డిని ఎలాగైనా హత్య చేయాలని కుట్ర పన్నాడు. అయితే పాలకవీడు పోలీ్‌సస్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న తన శిష్యుడు తంగిరాల రాంబాబును ఇందుకోసం సంప్రదించాడు.అతడి ద్వారా హత్య సుపారీగా రూ.10 లక్షలకు నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి గ్రామానికి చెందిన సయ్యద్‌ సయీద్‌, సయ్యద్‌ నదీంలను మాట్లాడుకున్నారు. ముందుగా రూ.3 లక్షలు గిరిధర్‌రెడ్డి అందజేశాడు. ప్లాన్‌ ప్రకారం పగడాల జనార్ధన్‌రెడ్డిని హత్య చేసేందుకు ఈ నెల 13న మోతెకు వచ్చి ఉదయం రెక్కీ నిర్వహించారు. మధ్యాహ్నం జనార్ధన్‌రెడ్డి ఇంటికి సయ్యద్‌ సయీద్‌, సయ్యద్‌ నదీంలు వెళ్లి మంచినీళ్లు అడిగారు. ఆ తర్వాత జనార్ధన్‌రెడ్డి ఎక్కడికి వెళ్లారని భార్య పూలమ్మను అడిగారు, అదే రోజు రాత్రి 12గంటల సమయంలో ఇంటి ముందు నిద్రిస్తున్న జనా ర్ధన్‌రెడ్డి మెడ, గొంతుపై కత్తులతో విచక్షణరహితంగా పొడవటంతో మృతి చెందాడు. పక్కా సమాచారంతో శుక్రవారం బండరామాపురం ఎక్స్‌ రోడ్డు సమీపంలో అద్దెకు ఉంటున్న గదిలో పట్టుకున్నట్లు తెలిపారు. హత్య చేసేందుకు కత్తులను ఆన్‌లైన్‌లో గిరిధర్‌రెడ్డి ఖరీదు చేశాడని, నిందితుల నుంచి మూడు కత్తులు, నాలుగు సెల్‌ఫోన్లు, స్వాధీనం చేసుకొని రిమాండ్‌ చేసినట్లు తెలిపారు. పగడాల గిరిధర్‌రెడ్డి తిరుమలగిరి మండలం మొండిచింతతండాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. గిరిధర్‌రెడ్డికి గతంలో రెండు హత్యకేసులతో సంబంధం ఉందని, ఇది మూడోదని, ఇతడిని ఏ-1గా, సయ్యద్‌ సయీద్‌ను ఏ-2, సయ్యద్‌ నదీం ఏ-3, హోం గార్డు తంగిరాల రాంబాబు ఏ-4గా నమోదు చేసినట్లు తెలిపారు. కేసును చేధించిన సీఐ ఆంజనేయులు, మోతె ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌లకు రివార్డు ప్రకటించనున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఎస్పీ రఘు, ఎస్‌ఐ బాలునాయక్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-21T06:25:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising