పట్టణం.. నిత్య నరకం
ABN, First Publish Date - 2022-10-17T06:07:38+05:30
భువనగిరి పట్టణ ప్రధాన రహదారి విస్తరణ పనుల్లో జాప్యం జరుగుతోంది. పనులతో రహదారిపై ఏర్పడిన గుంతలతో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యం అయ్యాయి.
భువనగిరి పట్టణంలో రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యం
భువనగిరి టౌన్, అక్టోబరు 16: భువనగిరి పట్టణ ప్రధాన రహదారి విస్తరణ పనుల్లో జాప్యం జరుగుతోంది. పనులతో రహదారిపై ఏర్పడిన గుంతలతో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యం అయ్యాయి. రహదారిపై పేరుకపోయిన మట్టి, ఇసుక తదితర వ్యర్థాల కారణంగా వాహనాల సంచారం, గాలులతో లేస్తున్న దుమ్ము ప్రజారోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. రోడ్డు పక్కనే పలు టిఫిన్ సెంటర్స్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్స్, పండ్ల దుకాణాలు కొనసాగుతున్నాయి. దుమ్ము పేరుకపోయిన ఆహార పదార్థాల విక్రయాలు ప్రజల ఆరోగ్యానికి మరింత హాని చేస్తున్నాయి. అయినప్పటికీ అధికారుల్లో స్పందన కన్పించడం లేదు. భువనగిరి పట్టణ అభివృద్ధి, ట్రాఫిక్ సమస్య నివారణకు రూ.25కోట్లతో 2.120కిలోమీటర్ల పాటు పట్టణ ప్రధాన రహదారి 100 ఫీట్ల విస్తరణ పనులను సుమారు 15నెలల క్రితం చేపట్టారు. ఇప్పటివరకు సివిల్ పనులు సుమారుగా పూర్తి కాగా, ఫుట్‌పాత్, విద్యుత్ సుందరీకరణ, ఇతర పనులు ఇంకా పూర్తి కావాల్సి ఉన్నది. పనుల కారణంగా రహదారి గుంతల మయంగా మారి ంది దీంతో గుంతలమయంగా మారిన రహదారిపై రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యం కాగా ఇప్పటి వరకు సుమారు 20మందికి పైగా తీవ్రంగా గాయపడడంతో కాళ్లు, చేతులు విరిగాయి. వీరిలో ఇప్పటికీ కొద్ది మంది చికిత్స పొందుతూ బెడ్‌కే పరిమితమయ్యారు. అలాగే ఈ రహదారి వెంట నిత్యం ప్రయాణించే వారి, రహదారి వెంట వ్యాపారాలు నిర్వహించే వా రిలో పలువురికి శ్వాసకోశ, కంటి సమస్యలు వస్తున్నాయి. రహదారి నుంచి వెలువడుతున్న దుమ్ము దూళిని ధీర్ఘకాలికంగా పీల్చుకోవడం ద్వారా పలు వురు శ్వాసకోశ సమస్యలకు గురవుతున్నారు. గుండెజబ్బులు, ఎలర్జి, ఆయ సం, దగ్గు, ఊపిరితిత్తులు, సమస్యలు ఉన్నవారు, కరోనా బాధితుల ఆరో గ్యంపై మరింత ప్రభావం చూపుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. రహ దారిపై లేస్తున్న దుమ్ము, దూళి కణాలు కళ్లలోకి చేరి కంటి సమస్యలు ఎ దురవుతున్నాయి. కంటిలో సున్నితమైన కార్నియాకు ముప్పుగా మారు తున్నది. దుమ్ము పేరుకపోతుండడంతో తరచుగా కళ్లను నలవాల్సి వస్తుం డడంతో మరిన్ని సమస్యలు వస్తున్నాయి. కళ్లలో ఎలర్జి, తరచుగా నీరు కా రడం, కంటి నొప్పి సాధారణంగా మారింది. రోడ్డు విస్తరణ పనులు సాగు తున్న రహదారి వెంటే పలు హోటల్స్, టిఫిన్, ఫాస్ట్ ఫుడ్, జూస్ సెంటర్లు కొనసాగుతున్నాయి. దుమ్ముతో కూడిన ఆహారం స్వీకరిస్తే జీర్ణకోశ వ్యాధు లకు గురయ్యే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు.
దుమ్ము ధూళితో కంటికి ముప్పు
దుమ్ము దూళితో కంటికి ముప్పు పొంచి ఉంటుంది. దూళి కణాలు కంటిలోకి చేరి పలు సమస్యలకు కారణం అ వుతుంది. దీర్ఘ కాలికంగా ఇదే తరహా సమస్యలను ఎదుర్కొంటే కంటి చూపునకే ఇబ్బందిగా మారే అవకాశాలుంటాయి. రహదారిపై వ్యాపిస్తున్న దుమ్ము కారణంగా కంటి సమస్యలతో భువనగిరిలోని కంటి ఆసు పత్రులకు వచ్చే బాధితుల సంఖ్య కొన్ని నెలలుగా పెరిగింది.
డాక్టర్ పి. సుమంత్‌రెడ్డి, నేత్ర వైద్యుడు.
దుమ్ము, ధూళితో ఊపిరితిత్తులకు హాని
ఎక్కువ రోజులు దుమ్ము, దూళితో కూడిన గాలిని పీల్చు కోవడం ద్వారా ఊపిరితిత్తులకు హాని కలుగుతుంది. ము ఖ్యంగా గుండె జబ్బులు, గతంలో కరోనాకు గురైన వారి ఆరోగ్యంపై ప్ర మాదం చూపుతుంది. భువనగిరి పట్టణ ప్రధాన రహదారిపై వ్యాపిస్తున్న దుమ్ము దూళితో ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.
డాక్టర్ సృజన, పల్మోనాలజిస్ట్, భువనగిరి జిల్లా ఆసుపత్రి.
Updated Date - 2022-10-17T06:07:38+05:30 IST