ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మళ్లీ తెరుచుకున్న సాగర్‌ క్రస్ట్‌ గేట్లు

ABN, First Publish Date - 2022-08-25T07:07:35+05:30

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు క్రస్ట్‌ గేట్లు మరల తెరుచుకున్నాయి. ఈ నీటి సంవత్సరంలో ఈ నెల 11వ తేదీ నుంచి 22వ తేదీ వరకు క్రస్ట్‌ గేట్ల ద్వారా అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువ నుంచి వరద రాక తగ్గంతో 22వతేదీ ఉదయం క్రస్ట్‌ గేట్లను మూసివేశారు.

సాగర్‌ 4 క్రస్ట్‌ గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాగర్‌ 4 క్రస్ట్‌ గేట్ల ద్వారా నీటి విడుదల 

నాగార్జునసాగర్‌, ఆగస్టు 24: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు క్రస్ట్‌ గేట్లు మరల తెరుచుకున్నాయి. ఈ నీటి సంవత్సరంలో ఈ నెల 11వ తేదీ నుంచి 22వ తేదీ వరకు క్రస్ట్‌ గేట్ల ద్వారా అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువ నుంచి వరద రాక తగ్గంతో 22వతేదీ ఉదయం క్రస్ట్‌ గేట్లను మూసివేశారు. మరల బుధవారం సాయంత్రం ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజె క్టు 3 క్రస్ట్‌ గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి  83949 క్యూసెక్కులు, కుడి గట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా 31135 క్యూసెక్కులు, ఎడమ గట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ను ఉత్ప త్తి చేయడం ద్వారా 31784 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు వదులుతున్నారు. శ్రీశైలం నుంచి సాగర్‌కు మొత్తం 1,46,868 క్యూసెక్కు ల నీరు సాగర్‌కు వచ్చి చేరుతుంది. దీంతో బుధవారం సా యంత్రం 6.45 గంటల సమయంలో సాగర్‌ 4 క్రస్ట్‌ గేట్లను 5 అడుగుల మేరకు ఎత్తి  32148 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ పూర్తి స్థాయి సామర్థ్యం 590 అడుగులు(312.0450టీఎంసీలు) కాగా ప్రస్తుతం 589.40 అడుగులుగా (310.2522టీఎంసీలుగా) ఉంది. సాగర్‌ నుంచి కుడి కాల్వ ద్వారా 7033 క్యూసెక్కులు, ఎడమకాల్వ ద్వారా 8367 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 33536 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2400 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 400 క్యూసెక్కుల నీటిని 4 క్రస్ట్‌ గేట్లను 5 అడుగులు మేరకు ఎత్తి 32148 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ నుంచి మొత్తం 83884 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా ఎగువ నుంచి 1,46,868 క్యూసెక్కుల నీరు సాగర్‌కు వచ్చి చేరుతుంది. 


12 రోజుల్లో 290.47 టీఎంసీలు కడలిలో కలిసిన వరద

నాగార్జునసాగర్‌ జలాశయం నుంచి 13 ఏళ్ల క్రితం 26 క్రస్ట్‌ గే ట్ల నుంచి స్పిల్‌వే ద్వారా  రెండు నెలల పాటు సుమారు 1500 టీఎంసీల వరద సముద్రం పాలైనట్లు ప్రాజెక్టు  అధికారులు తెలిపారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో స్పీల్‌వే 13 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని తట్టుకునేలా నిర్మించారు. అయితే ప్రాజెక్టు నిర్మాణ సమయంలో 1964లో  క్రస్ట్‌ గేట్ల స్థాయి వరకు ఉండగా ఎగువ నుంచి సుమారు 15 లక్షల క్యూసెక్కుల భారీ వరద వచ్చింది. ఆ ఉధృతికి ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఏపీ-తెలంగాణ రాష్ట్రాలకు మధ్య రవాణా కోసం ఏర్పాటు చేసిన బ్రిడ్జి, ఏపీలో మాచర్ల నుంచి కేసీపీ సిమెంట్‌ రావడానికి రైలులైన్‌ కూడా కొట్టుకుపోయింది. ఆ తర్వాత అంతటి స్థాయిలో వరద ఎప్పుడు రాలేదని అధికారులు తెలిపారు. 2009లో కృష్ణ పరివాహక ప్రాంతంలో ఎగువన కురిసిన భారీ వర్షాలతో సాగర్‌కు అత్యధికంగా 13 లక్షల వరద స్పిల్‌వే ద్వారా ప్రవహించిందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఏడాది ఈ నెల 11 నుంచి 22వ తేదీ వరకు అత్యధికంగా 4 లక్షల క్యూసెక్కుల వరద సాగర్‌ నుంచి సముద్రంలోకి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ఏడాది ఈ నెల 11వ నుంచి 22వ తేదీ వరకు సాగర్‌కు మొత్తం 291.91 టీఎంసీల నీరు వచ్చి చేరగా 12 రోజుల్లో క్రస్ట్‌ గేట్ల ద్వారా 238.47 టీఎంసీల నీరు, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 55 టీఎంసీల నీరు దిగువకు వదిలినట్లు ఎన్నెస్పీ అధికారులు తెలిపారు. ఈ ఏడాది 12 రోజుల్లో సాగర్‌ నుంచి 290.47 టీఎంసీల నీరు సముద్రం పాలైనట్లు అధికారులు తెలిపారు.


నేడు సాగర్‌ను సందర్శించనున్న 21 దేశాల ఈపీటీఆర్‌ఐ ప్రతినిధులు

నాగార్జునసాగర్‌ జలవిద్యుత్‌ కేంద్రాన్ని 21 దేశాలకు చెందిన ఈపీటీఆర్‌ఐ ప్రతినిధులు గురువారం సందర్శించనున్నారు.  ఎన్విరాన్‌మెంట్‌ ప్రొటెక్షన్‌ అండ్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌(ఈపీటీఆర్‌ఐ), రాష్ట్ర పర్యావరణ అటవీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా సాగర్‌ పైలాన్‌ కాలనీలో ఉన్న జలవిద్యుత్‌ కేంద్రాన్ని  ఉదయం 11.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సందర్శించనున్నన్నారు.

Updated Date - 2022-08-25T07:07:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising