ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరుల త్యాగాలు భావితరాలకు తెలియాలి

ABN, First Publish Date - 2022-08-15T05:50:27+05:30

ఇందిరాగాంధీ పరిపాలనలో 1975లో విధించిన ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా పోరాడి అమరులైన వారి త్యాగాలు భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేషనలిస్టు హ బ్‌ ఛానల్‌ ఫౌండర్‌, సీఈవో సాయికృష్ణ అ న్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న సాయికృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామగిరి, ఆగస్టు 14 : ఇందిరాగాంధీ పరిపాలనలో 1975లో విధించిన ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా పోరాడి అమరులైన వారి త్యాగాలు భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేషనలిస్టు హ బ్‌ ఛానల్‌ ఫౌండర్‌, సీఈవో సాయికృష్ణ అ న్నారు. ఆదివారం పట్టణంలోని చినవెంకట్‌రెడ్డి ఫంక్షన హాల్‌లో ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటయోధుల సంఘ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమకారులు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన వారిని పోలీసులు నానా చిత్రహింసలకు గురి చేసి ఐదునెలల పాటు జైలులో ఉంచారన్నారు. అందులో నల్లగొండకు చెందిన వారు 65మంది ఉన్నారని గుర్తు చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా అండర్‌గ్రౌండ్‌లో ఉండి కూడా పోరాటం చేశారని గుర్తుచేశారు. పోరాటయోధులు రామచంద్రయ్య, ఎర్రమళ్ల భాస్కర్‌, శ్రీరామోజు షణ్ముక మాట్లాడుతూ ఆనాడు స్వాతంత్య్రం కోసం పోరాటం చేస్తే,  ఇందిరాగాంధీ పరిపాలనలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, అంతకంటే ఎక్కువ పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి, గార్లపాటి జితేందర్‌రెడ్డి, బండారు ప్రసాద్‌, నన్నూరి రాంరెడ్డి, గార్లపాటి వెంకటయ్య, వీరెళ్లి చంద్రశేఖర్‌, మిర్యాల సత్యనారాయణ, కత్తుల విశ్వనాథం, నేవర్సు నీరజ, పాలకూరి రవి పాల్గొన్నారు.


Updated Date - 2022-08-15T05:50:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising