ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ABN, First Publish Date - 2022-12-15T00:22:19+05:30

సివిల్‌ సప్లయ్‌ హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

నల్లగొండలో నిరసన తెలుపుతున్న హమాలీ కార్మికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ రూరల్‌/ దేవరకొండ, డిసెంబరు 14: సివిల్‌ సప్లయ్‌ హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని సివిల్‌ సప్లయ్‌ గోదాము ఎదుట హమాలీ వర్కర్స్‌ యూ నియన్‌ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన సమ్మెను ప్రారంభించారు. సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ కార్మికుల వేతన ఒప్పందం డిసెంబరు 2021తో ముగిసిందన్నారు. జనవరి ఒకటో తేదీ నుంచి నూతన ఒప్పందం అమల్లోకి రావాల్సి ఉన్నా నేటికీ ప్రభుత్వం అమలు చేయ డం లేదన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ సివిల్‌ సప్లయ్‌ హమాలీ యూనియన్‌ జిల్లా కార్యదర్శి దొనకొండ వెంకటేశ్వర్లు, పందిరి బుచ్చ య్య, లింగస్వామి, బొడ్డు వెంకన్న, ఎల్లయ్య, జానయ్య, గిరి వెంక టేశ్వర్లు పాల్గొన్నారు. దేవరకొండ సివిల్‌ సప్లయ్‌ గోదాం ఎదుట జరి గిన ధర్నాలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేం దర్‌రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు నూనె వెంకటేశ్వర్లు, ఎల్లయ్య, అంజి, గణేష్‌, వెంకటేష్‌, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T00:22:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising