ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాత పింఛన్‌ విధానాన్ని అమలు చేయాలి

ABN, First Publish Date - 2022-06-30T08:07:32+05:30

పాత పింఛన్‌ విధా నాన్ని అమలు చేయాలని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ ప్రభు త్వాన్ని డిమాండ్‌ చేశారు.

చింతలపాలెంలో తహసీల్దార్‌ సచిన్‌ తివారికి వినతిపత్రం అందజేస్తున్న యూటీఎఫ్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌,  జూన్‌ 29: పాత పింఛన్‌ విధానాన్ని అమలు చేయాలని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు  అనిల్‌కుమార్‌ ప్రభు త్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం యూటీఎఫ్‌ మండల కమిటీ ఆధ్వర్యంలో  తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. పాఠశాలల్లో పారిశుధ్య కార్మికులను నియమ నియమించాలని,  విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, దుస్తులు అందించాలని కోరారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ ప్రకటించాలని ఆయన కోరారు.  అనంతరం డిప్యూటీ తహసీ ల్దార్‌కు మౌనికకు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో సీపీఎం మండల కార్యదర్శి షేక్‌ యాకుబ్‌, వ్యవ సాయ కార్మిక సంఘం నాయకులు వలీ, యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి రణబోతు రవీందర్‌, వెంకటరెడ్డి, వెంకటే శ్వర్లు, బాలసైదిరెడ్డి, కృష్ణయ్య, రాంబాబు, ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

- చింతలపాలె తహసీలాల్దార్‌ కార్యాలయం ఎదుట యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి శ్రీదేవి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా చేశారు. అనం తరం తహసీల్దార్‌ సచిన్‌ తివారీకి వినతిప్రతం అందజేశారు. కార్యక్ర మంలో మండల అధ్యక్షుడు  శ్రీనివాసాచారి, హర్షవర్ధన్‌ పాల్గొన్నారు.

- ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్‌ నాయకులు దామోదర్‌, శ్రీనివాస్‌రెడ్డి, రామకృష్ణ కోరారు. హుజూర్‌నగర్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో వారు మాటా ్లడారు. కార్యక్రమంలో లక్ష్మీకాంత్‌, చిక్కుళ్ల గోవింద్‌, రాజు పాల్గొన్నారు.  




Updated Date - 2022-06-30T08:07:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising