ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూసీ నీటిని విడుదల చేయాలి

ABN, First Publish Date - 2022-06-25T06:52:29+05:30

మూసీ ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేయాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లు నాగార్జునరెడ్డి డిమాండ్‌ చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న మల్లు నాగార్జునరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట సిటీ, జూన్‌ 24: మూసీ ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేయాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లు నాగార్జునరెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం సూర్యాపేటలో మూసీ ఎడమ కాలువ పరిఽధిలో ఉన్న గ్రామాల రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు వ్యవసాయ పనులను ప్రారంభించడానికి నేటి వరకు మూసీ కాల్వలకు నీటిని విడుదల చేయ కపోవడం బాధకరమన్నారు. నీటి విడుదల తేదీలను మూసీ ప్రాజెక్టు అధికారులు ప్రకటిస్తే రైతులు నార్లు పోయడానికి సిద్ధమవుతారని ఆయన అన్నారు.  మూసీ ఆయకట్టు కింద ఉన్న చెరువులను మూసీ నీళ్లతో నింపి, తూములకు షట్టర్లు బిగించాలని ఆయన డిమాండ్‌ చేశా రు. మూసీ కాల్వ భూములను కొంతమంది ఆక్రమించుకుని కాల్వలను చిన్నవిగా చేశారని, అధికారులు అన్యాక్రాంతమైన మూసీ కాల్వల పరి ఽధిని గుర్తించి హద్దు రాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి దండా వెంకటరెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి మందడి రాంరెడ్డి, జిల్లా నాయకులు పందిరి సత్యనారాయణరెడ్డి, నారాయణరెడ్డి, వీరారెడ్డి, నాగిరెడ్డి, పిండిగ జాన య్య, బొల్లా నాగేందర్‌రెడ్డి, గట్టిపల్లి సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.



Updated Date - 2022-06-25T06:52:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising