‘కంటి వెలుగు’ను విజయవంతం చేయాలి
ABN, First Publish Date - 2022-12-07T00:29:16+05:30
రాష్ట్ర ప్రజలకు కంటి సమస్యలు దూరం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ జనవరి 18వ తేదీ నుంచి ప్రారంభిస్తున్న రెండో దఫా కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీ్‌షరావు పిలుపునిచ్చారు.
సూర్యాపేట(కలెక్టరేట్), డిసెంబరు 6: రాష్ట్ర ప్రజలకు కంటి సమస్యలు దూరం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ జనవరి 18వ తేదీ నుంచి ప్రారంభిస్తున్న రెండో దఫా కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీ్‌షరావు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కార్యక్రమంలో అందరూ ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ముందుకెళ్లాలని ఆదేశించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ ఇందులో భాగస్వామ్యం కావాలన్నారు. కంటి వెలుగు కార్యక్రమం అమలుపై మంత్రి వివిధ జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి మాట్లాడారు. ప్రజలకు ఎంతో మేలు చేసే ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల్లోని అధికారులు ఉత్సాహంగా పాల్గొనాలని, ఎక్కడా నిర్లక్ష్యం వహించకూడదన్నారు. సీఎం కేసీఆర్ ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఏ కార్యక్రమం అయినా రూపొందిస్తారన్నారు. మొదటి విడత కంటివెలుగు కార్యక్రమం ఎనిమిది నెలలు కొనసాగిందని, రెండో విడత కార్యక్రమం 100 పనిదినాల్లో పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం గతం కంటే ఎక్కువ టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికి ఉచితంగా పరీక్షలు చేయడమే కాకుండా ఉచితంగా అద్దాలు పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమం ప్రారంభానికి ముందుగానే అవసరమైన అద్దాలను కేంద్రాలకు పంపిణీ చేయాలన్నారు. పరీక్షలు చేసిన నెలరోజుల్లో అద్దాల పంపిణీ పూర్తిచేయాలన్నారు. కలెక్టర్ పాటిల్ హేమంత్‌కేశవ్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న జనాభాకు అనుగుణంగా అవసరమైన మేర బృందాలను సిద్ధం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎస్. మోహన్‌రావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కోటాచలం పాల్గొన్నారు. మునిసిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని కలెక్టర్ పాటిల్ హేమంత్‌కేశవ్ అన్నారు. కలెక్టరేట్లో మునిసిపల్ కమిషనర్లతో మంగళవారం జరిగిన మాట్లాడారు. కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్లు బైరెడ్డి సత్యనారాయణరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-07T00:29:17+05:30 IST