ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లా ఏర్పాటుపై అసెంబ్లీలో ప్రస్తావించాలి

ABN, First Publish Date - 2022-09-12T05:22:44+05:30

జిల్లా ఏర్పాటు విషయమై సోమ, మంగళవారాల్లో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి జిల్లా ఏర్పాటుకు కృషి చేయాలని ఎమ్మెల్యేను భాస్కర్‌రావు ను కోరారు.

ఎమ్మెల్యేను కలిసిన జిల్లా సాధన సమితి నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఎమ్మెల్యేను కోరిన జిల్లా సాధన సమితి నేతలు

మిర్యాలగూడ, సెప్టెంబరు 11: జిల్లా ఏర్పాటు విషయమై సోమ, మంగళవారాల్లో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి జిల్లా ఏర్పాటుకు కృషి చేయాలని ఎమ్మెల్యేను భాస్కర్‌రావు ను కోరారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసిన  జిల్లా సాధన సమితి నేతలు ఈ మేరకు ఆయన్ను అభ్యర్థించారు.   జిల్లా సాధన కోసం రెండు నెలలుగా అనేక రూపాల్లో కార్యక్రమాలను కొనసాగిస్తున్నామన్నారు. ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రభు త్వం దృష్లికి తీసుకవెళ్లి సానుకూల నిర్ణయం తీసుకునేలా చూడాల ని కోరినట్లు తెలిపారు. అన్ని అర్హతలు ఉన్న మిర్యాలగూడ జిల్లాను జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో విద్యుత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మారం శ్రీనివాస్‌, బంజారా ఉద్యోగు ల సంఘం జిల్లా అధ్యక్షుడు మాలోతు దశరధ నాయక్‌, మునిసిప ల్‌ మాజీ వైస్‌ చైర్మన మగ్దూం పాషా, నాయకులు ఎర్రయ్య,  మురళి, వెంకటేశ్వర్లు, ఫారూక్‌, దుర్గయ్య, వెంకటయ్య పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌కుఉ లేఖ రాస్తా: జానారెడ్డి

నాగార్జునసాగర్‌, మిర్యాలగూడటౌన: మిర్యాలగూడను జిల్లా గా ఏర్పాటు చేసేందు కు సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తానని సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. సాగర్‌ హిల్‌కాలనీలో జానారెడ్డి నివాసంలో మిర్యాలగూడ జిల్లా పోరు సమితి (ఎంజేపీఎస్‌) ఆధ్వర్యంలో ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా సాధన సమితి సభ్యులు మిర్యాలగూడను జిల్లా ఏర్పా టు చేస్తే రైల్వే జోన, ప్రభుత్వ కార్యాలయాలకు సరిపడా ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఎంజేపీఎస్‌ చైర్మన రవి, నాయకులు సతీం, శంకు, యూసుఫ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-09-12T05:22:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising