ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు సమస్యలపై గళమెత్తుతా

ABN, First Publish Date - 2022-01-25T06:11:58+05:30

: రైతు సమస్యలపై పార్ల మెంట్‌లో గళం విన్పిస్తానని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. హుజూర్‌నగర్‌లోని క్యాంప్‌ కార్యాల యం నుంచి నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ కార్యకర్తలతో సోమవారం నిర్వహించిన జూమ్‌యాప్‌ మీటింగ్‌లో మా ట్లాడారు. ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు జరగనున్న పార్లమెంట్‌ సమావేశాల్లో రాష్ట్రంలోని రైతు సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను తెలంగాణ ప్రభుత్వం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్ర ప్రభుత్వంపై అన్నివర్గాల్లో వ్యతిరేకత

ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 

 జూమ్‌యాప్‌లో మాట్లాడుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 

హుజూర్‌నగర్‌, జనవరి 24: రైతు సమస్యలపై పార్ల మెంట్‌లో గళం విన్పిస్తానని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. హుజూర్‌నగర్‌లోని క్యాంప్‌ కార్యాల యం నుంచి నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ కార్యకర్తలతో సోమవారం నిర్వహించిన జూమ్‌యాప్‌ మీటింగ్‌లో మా ట్లాడారు. ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు జరగనున్న పార్లమెంట్‌ సమావేశాల్లో రాష్ట్రంలోని రైతు సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసేలా పార్లమెంట్‌ లో ఒత్తిడి తెస్తానన్నారు. ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలు అమలుచేయాల ని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతను మోసం చేశారన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యో గ, ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూశారని, సీఎం కేసీఆర్‌ యువతకు తీవ్ర అన్యా యం చేశారని విమర్శించారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్ని కలు వచ్చినా కాంగ్రెస్‌ అధి కారంలోకి రావడం ఖాయమన్నారు. టీఆర్‌ఎస్‌పై రైతులు, కార్మికులు, కర్షకులు, యువ త, మహిళలు అన్ని వర్గాలలో వ్యతిరేకత ఉందన్నారు. రైతు సమస్యలపై టీఆర్‌ఎస్‌, బీజేపీ ఎంపీలు పార్లమెంట్‌ లో ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. తానొక్కడినే అనేకమార్లు రైతాంగానికి జరుగుతు న్న అన్యాయంపై కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చానన్నారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలు మాత్రం బీజేపీకి వత్తాసు పలుకుతున్నారన్నా రు. తెలంగాణలో పోరాటం చేస్తామని చెబుతున్న టీఆర్‌ఎస్‌ నాయకులు ఢిల్లీలో మోదీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారన్నారు. హు జూర్‌నగర్‌ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కాంగ్రెస్‌ పార్టీ డిజిటల్‌ సభ్యత్వాలు 61వేల 500 పూర్తిచేశారన్నారు. ఈనెల 29 వరకు కార్యకర్తలు మరింత వేగవంతంగా లక్ష సభ్యత్వాలు పూర్తిచేయాలన్నారు.

Updated Date - 2022-01-25T06:11:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising