ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

ABN, First Publish Date - 2022-06-07T07:05:08+05:30

రైతుడిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని మాజీమంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. గుర్రం

గుర్రంపోడులో రచ్చబండ కార్య్రకమంలో మాట్లాడుతున్న జానారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మాజీ మంత్రి   కుందూరు జానారెడ్డి 

గుర్రంపోడు, జూన్‌ 6 : రైతుడిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని  మాజీమంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. గుర్రంపోడు మండలంలోని నడికుడ, కొప్పోలు, గుర్రంపోడు గ్రామాల్లో సోమవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడా రు. కాంగ్రెస్‌ పార్టీతోనే రైతు, పేదలకు సంక్షేమం సాధ్యమన్నారు. ప్రాజెక్టులను నిర్మించి లక్షల ఎకరాలకు సాగునీరు, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ, లాంటి పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీ కూడా చేయకపోవడం దారుణమన్నారు. ఆ రుణం కాస్తా రూ.2 లక్షలకు పెరిగే ప్రమాదం ఉందని భావించి కాంగ్రెస్‌ పార్టీ రైతులకు భరోసా కల్పించేందుకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ, గిట్టుబాటు ధర హామీలతో రైతుడిక్లరేషన్‌ ప్రకటించిందన్నారు. బూత్‌ కమిటీలు, గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయాలన్నారు. హామీలను విస్మరించి, ఆశించిన పాలన అందించకుండా టీఆర్‌ఎస్‌ అరాచక, నియంతృత్వ పాలన కొనసాగిస్తుందన్నారు. రైతు రుణమాఫీ, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి, డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు వంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించారన్నారు. నిత్యావసరాలు, మద్యం, పెట్రో ధరలు పెంచి పేదలపై భారం మోపుతున్నారన్నారు. మండలంలో తన హయాంలోనే బీటీరోడ్లు నిర్మించామన్నారు. సర్పంచులకు నిధులు లేవు, కాంట్రాక్టర్లు పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో  రాష్ట్ర నాయకుడు కుందూరు జైవీర్‌రెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తుమ్మలపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, కంచర్ల వెంకటేశ్వర్‌రెడ్డి, చనమల్ల జగదీశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు తగుళ్ల సర్వయ్య, ఎంపీటీసీ  కుప్ప రాములు, జాల చిన్న సత్తయ్య, సూదిని జగదీశ్వర్‌రెడ్డి, వడ్డెగోని యాదగిరిగౌడ్‌, కుప్ప అమరేందర్‌, ఆవుల వెంకన్న, షేక్‌ సత్తార్‌, బొమ్ము శ్రీనివాస్‌, టంగూటూరి సురేష్‌, కమతం జగదీశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-06-07T07:05:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising