ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి

ABN, First Publish Date - 2022-08-09T05:48:51+05:30

విద్యుత్‌ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ నేతలు డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ నాయకులు సోమవారం మెరుపు సమ్మె నిర్వహించారు.

నల్లగొండలో విద్యుత్‌ కార్యాలయం ఎదుట బైఠాయించిన ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యుత్‌ ఉద్యోగుల మెరుపు సమ్మె


నల్లగొండ టౌన్‌, ఆగస్టు 8: విద్యుత్‌ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ నేతలు డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ నాయకులు సోమవారం మెరుపు సమ్మె నిర్వహించారు. విధులు బహిష్కరిం చి సర్కిల్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు కార్యాలయం ఎదుట బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో విద్యుత్‌ కార్యాలయాల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. ధర్నానుద్దేశించి ఎస్‌ఈ టీఆర్‌.చంద్రమోహన్‌, డీఈ టెక్నికల్‌ రవికాంత్‌శర్మ, ఆపరేషన్‌ డీఈ విద్యాసాగర్‌, ఎంఅండ్‌పీ దేవకుమార్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేపెట్టనున్న విద్యుత్‌ సవరణ బిల్లుతో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న విద్యుత్‌ రంగ సంస్థలు పూర్తిగా నిర్వీర్యమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్‌ ఉద్యోగులు, రైతులు, వినియోగదారులపై కూడా ప్రభావం చూపే అవకాశమున్నందున వ్యతిరేస్తున్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్‌ ఎన్‌. వెంకటయ్య, కన్వీనర్‌ ఎ.నాగిరెడ్డి, జేఏసీ నాయకులు ఎం.సురేష్‌కుమార్‌, సీహెచ్‌ నరే్‌షకుమార్‌, జీహెచ్‌.రాజు, శ్రీనివా్‌సరెడ్డి, ఎండీ. బషీరుద్దిన్‌, ఎన్‌వీ.రావు,వెంకన్న, మురళీకృష్ణ, ఉదయ్‌కుమార్‌, సుగుణ, సంధ్య, జబీన్‌ పాల్గొన్నారు.

విద్యుత్‌ వనరులపై ప్రైవేట్‌ ఆధిపత్యం వద్దు : జూలకంటి

మిర్యాలగూడ : విద్యుత్‌ వనరులపై ప్రైవేట్‌ ఆధిపత్యం వద్దని సీపీఎం రాష్ట్ర కార్యద ర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. విద్యుత్‌ సవరణ చట్టం-2022ను వ్యతిరేకిస్తూ విద్యుత్‌ ఉద్యోగులు విధులు బహిష్కరించి మిర్యాలగూడలో ధర్నా నిర్వహించారు. దేశ సంపద, రాష్ర్టాల హక్కులు, ఉద్యోగుల భవిష్యత్‌ను శాసించే సవరణ చట్టం బిల్లును వ్యతిరేకించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు కె.సోమాచారి, పి.రాజేశ్వరరావు, కె.సీతారాములు, మారం శ్రీనివాస్‌, ఎం.సైదులు, కె.విజయ్‌, కె.బాబురావు, రాజేంద్ర పాల్గొన్నారు.

దామరచర్ల: విద్యుత్‌ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మండలంలోని యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ పరిశ్రమలో ఉద్యోగులు ధర్నా చేపట్టారు. సవరణ చట్టంతో ఉద్యోగులు ఇబ్బందు లు ఎదుర్కొనే అవకాశముందని కేంద్ర ప్రభుత్వం వెటనే చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీఈ సమ్మయ్య, ఎస్‌ఈలు రామకృష్ణారెడ్డి, హతీరాంం, జీవకుమార్‌, రమణమూర్తి, ఈఈ బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-09T05:48:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising