ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్ల సమీపాన క్రషర్‌ ప్లాంట్‌ను తొలగించాలి

ABN, First Publish Date - 2022-01-27T05:36:07+05:30

మండలం లోని పెద్దగుట్ట క్రషర్‌ప్లాంట్‌ను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్షాల ఆధ్వర్యంలో బాధిత రైతులు, సమీప ఇళ్ల యజమానులు డిమాండ్‌ చేశారు.

రాస్తారోకో చేస్తున్న నెమ్మికల్‌ గ్రామస్థులు, నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్మకూర్‌(ఎస్‌), జనవరి 26: మండలం లోని పెద్దగుట్ట క్రషర్‌ప్లాంట్‌ను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్షాల ఆధ్వర్యంలో బాధిత రైతులు, సమీప ఇళ్ల యజమానులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం నెమ్మికల్‌-ఆత్మకూర్‌(ఎస్‌) రహదారిపై మూడు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. భారీపేలుళ్ల కారణంగా నివాసగృహాలు దెబ్బతింటున్నాయని; పొలాలపై బూడిద పేరుకుపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎటు వంటి అనుమతులు లేకుండా కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న కెఎ్‌సఎన్‌ఆర్‌ క్రషర్‌ ప్లాంట్‌ ప్రభుత్వానికి, పంచాయతీకి పన్ను చెల్లించడం లేదన్నారు. దాదాపు 50మంది రైతులకు చెందిన 100 ఎకరాల భూమికి తీరని నష్టం జరుగుతోందన్నారు. రాత్రి, పగలు బ్లాస్టింగ్‌ జరుగుతుండటంతో వ్యవసాయ బావుల వద్దకు రైతులు పోవాలంటే భయపడుతున్నారన్నారు.ఎస్‌ఐ యాదవేందర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.కార్యక్రమంలో డేగల వెంకటకృష్ణ, పందిరి మాదవరెడ్డి, తంగెళ్ల వీరారెడ్డి, తం గెళ్ల సైదిరెడ్డి, పందిరి శ్రీనివా్‌సరెడ్డి, గిలకత్తుల ఎల్లయ్య, గునగంటి శ్రీను, పడిగి ఎల్లయ్య, విసవరం రాంరెడ్డి, పందిరి కృష్ణారెడ్డి, గంపల కరుణాకర్‌, గడ్డం వెంకట్‌రెడ్డి, పందిరి రాం గోపాల్‌రెడ్డి, విసవరం వెంకటనర్సింహ్మారెడ్డి, రాచమల్ల సంతోష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-27T05:36:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising