ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్‌, బీజేపీలకు అధికారం పగటికలే

ABN, First Publish Date - 2022-01-18T06:25:49+05:30

రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీలకు అ ధికారం పగటికలేనని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

విలేకరులసమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ సుఖేందర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి

గుర్రంపోడు, జనవరి 17:  రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీలకు అ ధికారం పగటికలేనని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలకేంద్రంలో  విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో కేసీఆర్‌ నా యకత్వంలోనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలకు తెలుసని, 2023లో జరిగే ఎన్నికల్లో మెజారి టీ సీట్లు సాధించి అధికారం చే పడుతామన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రె్‌సలో కుమ్ములాటలు ఉన్నాయని, బీ జేపీ వాపును చూసి బలుపు అనుకుంటుందని ఎద్దేవా చేశారు. ఉత్తరాది 5 రాష్ర్టాల్లో జరగనున్న ఎన్నికల్లో బీజేపీ అధికారం కోల్పోతుందన్నా రు. ఏడున్నరేళ్ల కాలంలో వ్యవసాయం, సంక్షేమం, అభివృద్ధి, ఐటీ రంగాల్లో మొదటి మూడు స్థానాల్లో తెలంగాణ రాష్ట్రం ఉందన్నారు. 317 జీవోలో ఇబ్బందులను గుర్తిం చి తొలగేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సమావేశంలో ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీ సామల బొజ్జయ్య, నాయకులు వెలుగు రవి, కుప్ప పృధ్వీరాజ్‌,  కుర్మారెడ్డి, బాల్‌రెడ్డి, చక్రవర్తి, నాగరాజు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-18T06:25:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising