ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యలు వినడానికి కలెక్టర్‌ సమయం ఇవ్వాలి

ABN, First Publish Date - 2022-02-16T06:43:20+05:30

జిల్లాలో నెలకొన్న సమస్యలు విన్నవించడానికి కలెక్ట ర్‌ సమయం ఇవ్వడం లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్‌ ఆరోపించారు. చౌ టుప్పల్‌లోని కందాళ రంగారెడ్డి భవన్‌లో మంగళవారం జరిగిన సీపీఎం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

సీపీఎం జిల్లా కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న జహంగీర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్‌


చౌటుప్పల్‌ టౌన్‌, ఫిబ్రవరి 15: జిల్లాలో నెలకొన్న సమస్యలు విన్నవించడానికి కలెక్ట ర్‌ సమయం ఇవ్వడం లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్‌ ఆరోపించారు. చౌ టుప్పల్‌లోని కందాళ రంగారెడ్డి భవన్‌లో మంగళవారం జరిగిన సీపీఎం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, సమస్యలు వినడానికి కలెక్టర్‌ సమయం కేటాయించకపోవడం దురదుష్టకరమని అన్నారు. మండల అధికారులు కార్యాలయాలకే పరిమితమయ్యారని, గ్రామా ల్లో ప్రజల సమస్యలను పట్టించుకునే వారు కరువయ్యారన్నారు. జిల్లాలోని చిన్న తర మా ప్రాజెక్టు పనులు నత్తనడకగా సాగుతున్నాయన్నారు. జిల్లాకు వచ్చిన సీఎం కేసీఆర్‌ అభివృద్ధి, సమస్యలపై ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం శోచనీయమన్నారు.  ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో సీఎం కేసీఆర్‌ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించా రు. పరిశ్రమల కాలుష్యం రోజు రోజుకూ పెరిగిపోతోందని, దీంతో వ్యవసాయ రంగం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు వైద్యం అందించే ప్రభుత్వ ఆస్పత్రు ల్లో సరైన వసతులు లేకపోవడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. సమావేశంలో సీపీఎం నాయకులు రొడ్డ అంజయ్య, అవ్వారీ రామేశ్వరీ, బి. అనురాధ, బి. కృషా ్ణరెడ్డి, కె.నర్సింహ, డి.నర్సిరెడ్డి, బి.యాదిరెడ్డి, కె.చంద్రారెడ్డి, బాల్‌రాజ్‌, పాండు, అశోక్‌రెడ్డి, సైదులు, ఎండీ. పాషా,నర్సింహ్మ, మల్లేశం ఉన్నారు.

Updated Date - 2022-02-16T06:43:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising