ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుర్తు తెలియని యువతి మృతదేహం లభ్యం

ABN, First Publish Date - 2022-01-24T06:05:04+05:30

గుర్తు తెలియని యువతి మృతదేహం నల్లగొండ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం లభ్యమైంది. రూరల్‌ ఎస్‌ఐ గోపాల్‌రావు తెలిపిన వివరాల ప్రకారం..

యువతి మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ క్రైం, జనవరి 23: గుర్తు తెలియని యువతి మృతదేహం నల్లగొండ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం లభ్యమైంది. రూరల్‌ ఎస్‌ఐ గోపాల్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ పరిధిలోని చర్లపల్లి నుంచి తాళ్లబాయిగూడెం వెళ్లే దారిలో సుమారు 25 ఏళ్ల వయస్సు ఉన్న యువతి మృతదేహం గుర్తించినట్లు తెలిపారు. మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచామని, గుర్తించిన వారు సెల్‌:9440795658 నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు. 

గుర్తు తెలియని వాహనం ఢీకొని యాచకురాలి మృతి

తిప్పర్తి మండలంలోని అనిశెట్టిదుప్పలపల్లి గ్రామం వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ(45) మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని అనిశెట్టి దుప్పలపల్లి గ్రామంలో 10 రోజులుగా గుర్తు తెలియని యాచకురాలు భిక్షాటన చేస్తూ పరిసర ప్రాంతంలో నివసిస్తోంది. ఆదివారం తెల్లవారుజామున మిర్యాలగూడ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు పోలీసులు తెలిపారు. గుర్తించిన వారు సెల్‌: 9440700051ను సంప్రదించాలని ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. 

Updated Date - 2022-01-24T06:05:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising