ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మత విద్వేషాలు రెచ్చగొట్టే బీజేపీకి బుద్ధి చెప్పాలి

ABN, First Publish Date - 2022-09-12T04:41:47+05:30

దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీకి ప్రజలు త్వరలో బుద్ధి చెబుతారని డీసీసీబీ చైర్మన్‌, టెస్కాబ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొం గిడి మహేందర్‌రెడ్డి అన్నారు.

టీఆర్‌ఎస్‌లో చేరుతున్న కార్యకర్తలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదగిరిగుట్ట రూరల్‌, సెప్టెంబరు 11: దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీకి ప్రజలు త్వరలో బుద్ధి చెబుతారని డీసీసీబీ చైర్మన్‌, టెస్కాబ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొం గిడి మహేందర్‌రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట తన నివాసంలో బొమ్మలరామారాం మండలానికి చెందిన కంచల్‌తండాకు చెందిన కాంగ్రెస్‌ మాజీ సర్పంచ్‌ దీరావత్‌ రమేష్‌నాయక్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు పోలగాని వెంకటేష్‌గౌడ్‌, గుర్రాల లక్ష్మారెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ బాలనర్సింహ్మ ఆధ్వర్యంలో 200మందికి ఆదివారం గులాబీ కడువకప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. దేశంలో ధరలను అరికట్టని కేంద్ర ప్రభుత్వం ఈడీ, ఐటీ దాడులతో రాష్ట్ర నాయకులను భయ బ్రాంతులకు చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఆలేరు మార్కెట్‌ చైర్మన్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్‌, కె. సత్యనారాయణ, రాజయ్య, మచ్చ శ్రీనివాస్‌గౌడ్‌, చంద్రమౌళి, సింగిల్‌ విండో వైస్‌ చైర్మన్‌ కొండల్‌రెడ్డి, సర్పంచ్‌లు గణేష్‌, బీరప్ప, నవీన్‌, మాజీ ఎంపీపీ రామప్ప, లింగానాయక్‌, సుమన్‌నాయక్‌, రాజు పాల్గొన్నారు. ఆలేరు మండలంలోని మందనపల్లికి చెందిన సీపీఐ(ఎంఎల్‌) నాయకుడు బండి బిక్షపతి, కుర్మ. చంద్రయ్య ఆధ్వర్యంలో డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి సమక్షంలో 50మంది కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. 


Updated Date - 2022-09-12T04:41:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising