ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

ABN, First Publish Date - 2022-12-16T01:26:04+05:30

జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్య క్షుడు కోల నాగేశ్వరరావు కోరారు.

సమావేశంలో మాట్లాడుతున్న కోల నాగేశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజూర్‌నగర్‌ రూరల్‌, డిసెంబరు 15: జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్య క్షుడు కోల నాగేశ్వరరావు కోరారు. గురువారం పట్టణంలో నిర్వహించిన యూనియన్‌ సమావే శంలో ఆయన మాట్లాడారు. కార్పొరేట్‌ వైద్యశా లల్లో జర్నలిస్టుల హెల్త్‌ కార్డులు సక్రమంగా పనిచేసేలా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వా లన్నారు. జర్నలిస్టుల పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 50 శాతం సబ్సిడీపై విద్యను అందించడానికి ప్రభుత్వ జీవో జారీ చేయాల న్నారు. డెస్క్‌ల్లో పనిచేస్తున్న సబ్‌ ఎడిటర్లందరికీ పూర్తిస్థాయిలో అక్రిడిటేషన్లు కల్పించా లన్నారు. సమస్యల పరిష్కారానికి రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఉద్యమాలు చేయడానికి జిల్లాలోని జర్నలిస్టులు సన్నద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో టీవీఎల్‌, రాజు, రాంరెడ్డి, శ్రీనివాసాచారి, జానీ, భాస్కర్‌, శ్రీను పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T01:26:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising