ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యుద్ధం వద్దంటూ కళాకారుడి పాదయాత్ర

ABN, First Publish Date - 2022-03-04T06:06:46+05:30

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి నేపథ్యంలో ‘యుద్దం వద్దు- శాంతి ముద్దు’ నినాదంతో ప్రజా కళాకారుడు జన జాగో మండలి రాష్ట్ర కార్యదర్శి బాదె నర్సయ్య పాదయాత్ర ప్రారంభించారు.

నర్సయ్యను సన్మానిస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేరేడుచర్ల, మార్చి 3: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి నేపథ్యంలో ‘యుద్దం వద్దు- శాంతి ముద్దు’ నినాదంతో ప్రజా కళాకారుడు జన జాగో మండలి రాష్ట్ర కార్యదర్శి బాదె నర్సయ్య పాదయాత్ర ప్రారంభించారు. నేరేడుచర్ల నుంచి ఏపీ రాష్ట్రం కృష్ణా జిల్లా విజయవాడ వరకు చేపట్టిన పాదయాత్రను నేరేడుచర్లలో గురువారం క్రాంతినికేతన్‌ స్వచ్ఛంద సంస్థ అధినేత సుంకర క్రాంతికుమార్‌, గ్రంథాలయ అభివృద్ధికమిటీ మాజీ చైర్మన్‌ కర్రి సూరిబాబు, రాపోలు నవీన్‌, చిట్యాల శ్రీను, తక్కెళ్లపల్లి నాగార్జున,  జంపాల వెంకన్న, శ్రవణ్‌, పాఠశాల విద్యార్థులు జాతీయ జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా బాదె నర్సయ్య మాట్లాడుతూ రష్యా, ఉక్రెయిన్‌ దేశాల నడుమ జరుగుతున్న యుద్దంలో పెద్దఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం తప్పదన్నారు. ఇరు దేశాలు వెనక్కి తగ్గకపోవడంతో మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం పొంచి ఉందన్నారు. ఇలాంటి పరిస్థితులు ఏర్పడకుండా ప్రజలు వీధుల్లోకి రావాలని, యుద్ధ వ్యతిరేక నినాదాలు చేసి పాదయాత్రకు సంఘీభావం తెలపాలని కోరారు. సుమారు 133 కిలోమీటర్ల దూరం నర్సయ్య పాదయాత్ర చేయనున్నారు. 

Updated Date - 2022-03-04T06:06:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising