ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవాలయాలు సంస్కృతీసంప్రదాయాలకు నిలయాలు

ABN, First Publish Date - 2022-08-18T06:10:04+05:30

దేవాలయాలు సంస్కృతీసంప్రదాయాలకు నిలయాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. మండల కేంద్రంలో వీరాంజనేయస్వామి దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసి అనంతరం ఆయన మాట్లాడారు.

మోతె మండలం బుర్కచర్లలో సీతారామాంజనేయ ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిలుకూరు, ఆగస్టు 17: దేవాలయాలు సంస్కృతీసంప్రదాయాలకు నిలయాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. మండల కేంద్రంలో వీరాంజనేయస్వామి దేవాలయ నిర్మాణానికి  శంకుస్థాపన చేసి అనంతరం ఆయన మాట్లాడారు. ఈ దేవాలయం నిర్మాణానికి తనవంతు సహకారం అందిస్తామన్నారు.  ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్‌ కొండా సైదయ్య, ఎంపీటీసీ రమణ నాగయ్య, సర్పంచ్‌ కొడారు బాబు, సొసైటీ చైర్మన్‌ అల్సకాని జనార్దన్‌, బట్టు శివాజీ, ఆలయ కమిటీ సభ్యులు యడవెల్లి పుల్లారావు, గరిణె శేషగిరిరావు, మండవ అచ్చయ్య, గడ్డం శ్రీనివాస్‌, వెంకటేశ్వర్లు, వీరబాబు, శ్రీనివా్‌సరెడ్డి, రాంబాబు పాల్గొన్నారు.

దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

మోతె: దేవాలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ఎంతో కృషి చేస్తునాన్నరని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. మండలంలోని బుర్కచర్ల గ్రామంలో  శ్రీసీతారామాంజనేయస్వామి ఆలయానికి ఆయన భూమి పూజ చేసి మాట్లాడారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ దాచేపల్లి కరుణసాగర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు శీలం సైదులు, వార్డు మెంబర్లు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

కోదాడ ఆసుపత్రికి డయాలసిస్‌ కేంద్రం మంజూరు 

కోదాడ రూరల్‌: కోదాడ ఆసుపత్రికి డయాలసిస్‌ కేంద్రం మంజూరైనట్లు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ తెలిపారు. కోదాడ పట్టణంలో ఆయన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఏదైనా జబ్బుచేసి ఆసుపత్రికి వెళితే చికిత్స కంటే వైద్యపరీక్షలకే ఎక్కువ డబ్బులు ఖర్చవుతాయన్నారు. సామాన్య ప్రజలపై ఈ భారం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం కోదాడ ఆసుపత్రిలో ఉచిత డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు చేయటంతో పాటు  అన్నిరకాల పరీక్షలకు అవసర మైన పరికరాలను ప్రభుత్వం సిద్ధం చేస్తుందన్నారు. డయాలసిస్‌ సెంటరును మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌, మంత్రి హరీష్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. 


Updated Date - 2022-08-18T06:10:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising