ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ ఉత్పత్తిలో తెలంగాణ అగ్రగామి

ABN, First Publish Date - 2022-05-28T06:15:16+05:30

వరి దిగుబడిలో పంజాబ్‌ రాష్ట్రాన్ని మించామని, ధాన్యం కొనుగోలు, విద్యుత్‌ ఉత్పత్తిలో దేశంలో అగ్రగామిగా ఉన్నామని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం ఆల్డీ నగరంలో ఎన్‌ఆర్‌ఐల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.

అమెరికాలోని ఎన్‌ఆర్‌ఐల ఆధ్వర్యంలో మాట్లాడుతున్న మంత్రి జగదీ్‌షరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పంజాబ్‌కు దీటుగా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం

విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి


సూర్యాపేటఅర్బన్‌, మే 27: వరి దిగుబడిలో పంజాబ్‌ రాష్ట్రాన్ని మించామని, ధాన్యం కొనుగోలు, విద్యుత్‌ ఉత్పత్తిలో దేశంలో అగ్రగామిగా ఉన్నామని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం ఆల్డీ నగరంలో ఎన్‌ఆర్‌ఐల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రైతులు ఉత్పత్తి చేసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేస్తే సీఎం కేసీఆర్‌ మానవీయకోణంలో స్పందించి కొనుగోలు చేశారని వివరించారు. యావత్‌ దేశానికి అభివృద్ధి నమూనాను అందిస్తూ సీఎం కేసీఆర్‌ అద్భుత పాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు. విద్యుత్‌ ఉత్పత్తిలో తెలంగాణ పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. అనుకున్న సమయంలో స్వీయ నియంత్రణతో ప్రారంభించిన మిషన్‌ భగీరథ పథకం ఫ్లోరోసిస్‌ రహిత రాష్ట్రంగా మార్చిందన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐలు, నాయకులు ఏనుగు శ్రీనివా్‌సరెడ్డి, బొజ్జ అమరేందర్‌రెడ్డి, నంద్యాల దయాకర్‌రెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, మనోహర్‌, విష్ణు, శ్రవణ్‌, బాబురావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-28T06:15:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising