ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీని సంస్థాగతంగా బలోపేతం చేయాలి

ABN, First Publish Date - 2022-01-24T06:37:25+05:30

టీడీపీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కిలి అయిలయ్య, టీడీపీ నల్లగొండ పార్లమెంట్‌ అధ్యక్షుడు నెల్లూరి దుర్గాప్రసాద్‌ కోరారు. ఆది వారం పట్టణంలోని రైస్‌మిల్లర్స్‌ భవన్‌లో టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేష్‌ జన్మదినం సందర్భంగా కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు.

లోకేష్‌ జన్మదినం సందర్భంగా హుజూర్‌నగర్‌లో కేక్‌ కట్‌ చేస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జక్కిలి అయిలయ్య 

హుజూర్‌నగర్‌, జనవరి 23: టీడీపీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కిలి అయిలయ్య, టీడీపీ నల్లగొండ పార్లమెంట్‌ అధ్యక్షుడు నెల్లూరి దుర్గాప్రసాద్‌ కోరారు. ఆది వారం పట్టణంలోని రైస్‌మిల్లర్స్‌ భవన్‌లో  టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేష్‌ జన్మదినం సందర్భంగా కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు.  తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ఎంతో కృషి చేశాడన్నారు.  ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుచేయడంలో సీఎం కేసీఆర్‌ విఫలమయ్యారన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలపై కార్యకర్తలు పోరాటం చేయాలన్నారు. పట్టణ అధ్యక్షుడి పదవి కోసం ఎన్నిక నిర్వహించగా, నలమాద శ్రీనివాస్‌, షేక్‌ అలీ, ఇట్టిమళ్ల శ్రీనివాస్‌, ఎలక వెంకటేశ్వర్లు, ఆవులపాటి శ్రీను, సైదులు పోటీపడ్డారు. ఏకాభిప్రాయం కుదరనందున అధ్యక్షుడి ఎంపికను వాయిదా వేశారు. కార్యక్రమంలో బెల్లంకొండ రామజోగి, గార్లపాటి శ్రీనివాస్‌, చల్లా వంశీ, మండవ వెంకటేశ్వర్లు, అంజయ్య, సైదులు, నాగూనాయక్‌, ప్రతాప్‌ పాల్గొన్నారు. 

ఆసుపత్రుల్లో  పండ్ల పంపిణీ

హుజూర్‌నగర్‌/మఠంపల్లి/మోతె: నారా లోకేష్‌ జన్మదినం సందర్భంగా హుజూర్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో, మఠంపల్లి పీహెచ్‌సీలో రోగులకు పండ్లు, బ్రెడ్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో తెలుగు యువత నాయకుడు మండవ వెంకటేశ్వర్లుగౌడ్‌, రాష్ట్ర అధికార ప్రతినిఽధి షేక్‌ ఆలీపాషా, అంజయ్య, సైదులు, మఠంపల్లి మండల అధ్యక్షుడు మాలోతు నాగు నాయక్‌, మండవ వెంకటేశ్వర్లు, ఆలీ, సతీష్‌,  పాల్గొన్నారు. మోతెలో  తెలుగు యువత మండల అధ్యక్షుడు ఏలూరి గిరిబాబు ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోతె మండల కేంద్రంలో ఎన్‌టీఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు దోసపాటి రాములు, నాగయ్య, కట్ల వెంకటనర్సు  తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-01-24T06:37:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising