ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పట్టుదలతో చదివి విజయం సాధించాలి

ABN, First Publish Date - 2022-12-06T23:47:52+05:30

విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్‌ పమేలాసత్పథి తెలిపారు. మంగళవారం మండలకేంద్రంలో వేంకటేశ్వర ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కాంపిటీటివ్‌ ఎగ్జామినేషన్స్‌, కెరీర్‌ గైడెన్స్‌ సెల్‌ను కలెక్టర్‌ ప్రారంభించి మాట్లాడారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పమేలాసత్పథి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ పమేలాసత్పథి

వలిగొండ, డిసెంబరు 6: విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్‌ పమేలాసత్పథి తెలిపారు. మంగళవారం మండలకేంద్రంలో వేంకటేశ్వర ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కాంపిటీటివ్‌ ఎగ్జామినేషన్స్‌, కెరీర్‌ గైడెన్స్‌ సెల్‌ను కలెక్టర్‌ ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ విద్యాలయాలు నాణ్యమైన విద్యనందిస్తాయని, విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేస్తాయని, ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రథమస్థానంలో నిలుస్తాయన్నారు. విద్యార్థులు క్రమంతప్పకుం డా తరగతులకు హాజరు కావాలన్నారు. మాతృభాష తెలుగుతోపాటు ఆంగ్ల భాషపై కూడా పట్టు సాధించాలని నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇంటర్‌ నోడల్‌ అధికారి రమణి, కళాశాల ప్రిన్సిపల్‌ లక్ష్మీకాంత్‌కుమార్‌, విక్రమ్‌ బాబు, సోమ శేఖర్‌, సుందర్‌, మురళీ, ఉదయ్‌కుమార్‌, భిక్షం, సైదా పాల్గొన్నారు.

ఆధార్‌ను నవీకరించుకోవాలి: కలెక్టర్‌

భువనగిరి రూరల్‌: ఆధార్‌ను ప్రతీ పదేళ్లకు ఒకసారి నవీకరించుకోవాలని కలెక్టర్‌ పమేలాసత్పథి సూచించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి ఆధార్‌ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం ప్రతీ పనికి ఆధార్‌ తప్పనిసరి అయిందని, ఆధార్‌ పక్కదారి పట్టకుండా చూసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ డి.శ్రీనివా్‌సరెడ్డి, డీసీపీ నారాయణరెడ్డి, ఆధార్‌ ఇ-మేనేజర్‌ సాయికుమార్‌, ఎల్‌డీఎం రామకృష్ణ, డీఈవో నారాయణరెడ్డి, శిశుసంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-06T23:47:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising