ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పే స్కేల్‌ ఇచ్చే వరకు సమ్మె

ABN, First Publish Date - 2022-08-18T05:39:01+05:30

సీఎం కేసీఆర్‌ గతంలో ఇచ్చిన హామీ ప్రకారం వీ ఆర్‌ఏలకు పే స్కేల్‌ ఇచ్చే వరకు సమ్మె విరమించేది లేదని వీఆర్‌ఏ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ ఎండీ రఫీ, డివిజన కన్వీనర్‌ కందుల స్వామి, సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు ల క్ష్మీనారాయణ డిమాండ్‌ చేశారు.

ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్న వీఆర్‌ఏలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండఅర్బన, శాలిగౌరా రం, ఆగస్టు 17:  సీఎం కేసీఆర్‌ గతంలో ఇచ్చిన హామీ ప్రకారం వీ ఆర్‌ఏలకు పే స్కేల్‌ ఇచ్చే వరకు సమ్మె విరమించేది లేదని వీఆర్‌ఏ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ ఎండీ రఫీ, డివిజన కన్వీనర్‌ కందుల స్వామి, సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు ల క్ష్మీనారాయణ డిమాండ్‌ చేశారు. జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్లగొండ డివిజన పరిధిలోని 11 మండలాల వీఆర్‌ఏలు జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నల్లగొండ ఆర్డీవో కార్యాల యం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండేళ్ల క్రితం వీఆర్‌ఏలకు పే స్కేల్‌ ఇస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్‌ నేటివరకు అమలు చేయలేదన్నారు. అరకొర వే తనాలతో అధిక పనిభారంతో వీఆర్‌ఏలు విధులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. 25 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విడ్డూ రమన్నారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ధర్నాలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, వీఆర్‌ఏ సంఘాల జేఏసీ జిల్లా కో కన్వీనర్‌ లతీఫ్‌, శంకర్‌, రామచంద్రం, శ్రీను, జ్యోతి, సంధ్య, లింగస్వామి పాల్గొన్నారు. 

 


Updated Date - 2022-08-18T05:39:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising