ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : జడ్పీ సీఈవో

ABN, First Publish Date - 2022-07-06T05:30:00+05:30

అభివృద్ధి పనుల పురోగతిలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జడ్పీ సీఈవో సురే్‌షకుమార్‌ హెచ్చరించారు.

గోరెంట్లలో పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలిస్తున్న జడ్పీ సీఈవో సురేష్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మద్దిరాల / సూర్యాపేట, జూలై 6 : అభివృద్ధి పనుల పురోగతిలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జడ్పీ సీఈవో సురే్‌షకుమార్‌ హెచ్చరించారు. మద్దిరాల, తుంగతుర్తి మండలాల్లో ఆయన బుధవారం పర్యటించారు. మద్దిరాల మండలం గోరేంట్ల గ్రామంలో మెగా పల్లె ప్రకృతి, శ్మశాన వాటికలను, క్రీడా ప్రాంగణం, డంపింగ్‌ యార్డులు, సెగ్రిషన్‌ షెడ్లు, పారిశుధ్య పనులను ఆయన పరిశీలించి, మాట్లాడారు. పల్లె ప్రగతిలో అసంపూర్తి పనులను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అన్నారు. ఆయన వెంట ఎంపీడీవో సరోజ, ఏపీవో వెంకన్న, పంచాయితీ కార్యదర్శి మంగ, ఈసీ చారి, టెక్నికల్‌ అసిస్టెంట్‌ మురళీ పాల్గొన్నారు. అదేవిధంగా తుంగతుర్తి మండలం గానుగబండ గ్రామంలో జడ్పీ సీఈవో సురేష్‌ పర్యటించారు. గ్రామంలో జరిగిన ఉపాధిహామీ పనులను ఆయన పరిశీలించారు. సిబ్బందికి తగిన సూచనలు చేశారు. అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో భీంసింగ్‌, సర్పంచ్‌ నల్లు రామచంద్రారెడ్డి ఉన్నారు.


Updated Date - 2022-07-06T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising