ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పచ్చని పంటలపై గడ్డి మందు పిచికారీ

ABN, First Publish Date - 2022-08-04T05:55:57+05:30

రైతులు, అటవీ శాఖ అధికారుల మధ్య వివాదం పచ్చని పంటల నాశనానికి దారితీసింది. ఎప్పటిలాగే పట్టా భూముల్లో రైతులు అపరాలు సాగు చేయగా, గుర్తు తెలియని వ్యక్తులు గడ్డిమందు పిచికారీ చేయటంతో పంట పూర్తిగా దెబ్బతింది.

చిలుకూరులో పట్టా పాస్‌పుస్తకాలతో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిలుకూరు, ఆగస్టు 3 : రైతులు, అటవీ శాఖ అధికారుల మధ్య వివాదం పచ్చని పంటల నాశనానికి దారితీసింది. ఎప్పటిలాగే పట్టా భూముల్లో రైతులు అపరాలు సాగు చేయగా, గుర్తు తెలియని వ్యక్తులు గడ్డిమందు పిచికారీ చేయటంతో పంట పూర్తిగా దెబ్బతింది. అటవీ శాఖ అధికారులే పంటలను నాశనం చేశారంటూ రైతులు పంట పొలాల్లో పట్టా పాస్‌పుస్తకాలతో బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చిలుకూరు మండల కేంద్రంలోని 1151 సర్వే నెంబరులో మొత్తం 750 ఎకరాల భూమి ఉంది. ఇందులో ప్రభుత్వ, పట్టా భూములు ఉన్నాయి. ఈ భూముల్లో సన్న, చిన్నకారు రైతులు సాగు చేసుకుంటున్నారు. మూడు దశాబ్దాల కిందట ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులతో సర్వే చేయించిన ప్రభుత్వం భూమి లేని నిరుపేద రైతులకు పంపిణీ చేసింది. అప్పటినుంచి రైతుల పేరుమీదనే పట్టాభూమిగా కొనసాగుతోంది. అయితే రెండేళ్ల కిందట రెవెన్యూ అధికారులు రైతులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా 68ఎకరాల భూమిని అటవీ శాఖకు అప్పగించారు. రెవెన్యూ అధికారులు అటవీ శాఖకు అప్పగించిన భూమిలో పట్టా పాసు పుస్తకాలు కలిగి ఉన్న 10మంది రైతుల భూములు ఉన్నాయి. అప్పటి నుంచి రైతులకు అటవీ శాఖ అధికారులకు మధ్య వివాదం మొదలైంది. ఇదిలా ఉంటే రైతులు ఇటీవల పట్టా భూముల్లో అపరాల సాగు చేపట్టారు. అయితే తమకు కేటాయించిన స్థలంలో రైతులు సాగు చేశారు. కొంతమంది వ్యక్తులు పచ్చగా పెరిగిన పంటపై గడ్డి మందు పిచికారీ చేయటంతో పూర్తిగా ఎండిపోయింది. 

అధికారుల చర్యలు సరికాదు : రైతులు 

పంటలపై అటవీ శాఖ అధికారులు గడ్డిమందు పిచికారీ చేయడం సరికాదని, బాధ్యతారహితంగా పంటలను నాశనం చేశారని రైతులు కె.లక్ష్మినర్సు, బి.ఇందిర, ఎల్లయ్య, కవిత ధ్వజమెత్తారు. పంట పొలాల్లో పట్టా పాస్‌ పుస్తకాలు పట్టుకుని బుధవారం నిరసన వ్యక్తం చేశారు. తమ పట్టా భూమిని రెవెన్యూ అధికారులు అటవీ శాఖకు కేటాయించడం సరికాదని, తమకు న్యాయం చేయాలని వారు కోరారు. 

మాకు సంబంధం లేదు : గౌతమ్‌, ఎఫ్‌ఆర్‌వో హుజూర్‌నగర్‌

పంటలను నాశనం చేసేందుకు గడ్డిమందు పిచికారీ చేయించారన్న ఆరోపణలు సరికాదు. రెవెన్యూ అధికారులు కేటాయించిన భూముల్లో సాగును అడ్డుకుంటామే తప్ప ధ్వంసం చేయలేదు. పంటల ధ్వంసానికి, శాఖ సిబ్బందికి సంబంధం లేదు.

Updated Date - 2022-08-04T05:55:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising