ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో ఆధ్యాత్మిక సందడి

ABN, First Publish Date - 2022-05-25T06:04:56+05:30

మండలకేంద్రంలోని శ్రీయోగానందలక్ష్మీనృసింహస్వామి ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవంలో భాగంగా మహిళలు జలాభిషేకం నిర్వవహించారు. స్వామి, అమ్మ

అర్వపల్లిలో ధ్వజస్తంభానికి జలాభిషేకం చేస్తున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేవాలయాల ప్రతిష్ఠాపన మహోత్సవాలు, జాతరలు, ఉత్సవాలతో జిల్లాలో మంగళవారం ఆధ్యాత్మిక సందడి నెలకొంది. శాస్త్రోక్తంగా సంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్న ఈ వేడుకలతో గ్రామీణ ప్రాంతాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. 

అర్వపల్లి, మే 24: మండలకేంద్రంలోని శ్రీయోగానందలక్ష్మీనృసింహస్వామి ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవంలో భాగంగా మహిళలు జలాభిషేకం నిర్వవహించారు. స్వామి, అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. యాగశాలలో అర్చకులు హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్‌, ఆలయ చైర్మన్‌ చిల్లం విద్యాసాగర్‌, ఎంపీటీసీ కనుకు పద్మాశ్రీనివాస్‌, మాజీ ఎంపీపీ దావుల మనీష, కడారి నరేష్‌, రాంబాబు, పవన్‌, వికానసచార్యులు పాల్గొన్నారు.ఇదిలా ఉండగా  నేడు నిర్వహించే ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవానికి మంత్రి జగదీ్‌షరెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు హాజరవుతున్నట్లు దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు.  

మఠంపల్లి మండలంలో 

మఠంపల్లి: మండలంలోని కృష్ణతండా, భీమ్లాతండాలలో శ్రీభక్తాంజనేయస్వామి దేవాలయ కీర్తిధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవాల్లో భాగంగా జలాధివాసం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్నిప్రతిష్ఠ, దేవతమూర్తులకు జలాధివాసం, హోమాలు, తీర్థగోష్టి ఘనంగా నిర్వహించారు. బలిహరణ సందర్భంగా తండాకు ఉన్న రహదారులను మూసివేసి పొత్తు పోశారు. కార్యక్రమంలో ఎంపీపీ ముడావత్‌ పార్వతీకొండానాయక్‌, ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు. 

సౌడమ్మ జాతరలో 

పెన్‌పహాడ్‌: మండల కేంద్రంలో లింగమంతుల స్వామి, సౌడమ్మ జాతర సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్య క్షుడు సంకినేని వెంకటేశ్వరరావు డోలు వాయించారు. కార్యక్రమంలో రాపర్తి వెంకన్న, బొల్లక సైదులు, ఎగ్గడి సతీష్‌, చామకూరి వెంకటేశ్వర్లు, సందీప్‌, లింగయ్య, లక్ష్మణాచారి, జాను, రాములు పాల్గొన్నారు. 

గట్టికల్‌లో లింగమంతుల జాతర  

ఆత్మకూర్‌(ఎస్‌): మండలంలోని గట్టికల్‌లో శ్రీలింగమంతులస్వామి జాతరను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పొడుపు గొర్ర మహంకాళమ్మ వేషధారణ, పులిహారపు బండ్ల ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-25T06:04:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising