ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హరిహరులకు విశేష పూజలు

ABN, First Publish Date - 2022-07-05T05:48:00+05:30

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో సోమవారం శివకేశవులకు విశేష పూజలు సంప్రదాయరీతిలో నిర్వహించారు. లక్ష్మీనృసింహుడికి శ్రీవైష్ణవ ఆచార పరంగా, శివాలయంలో కొలువుదీరిన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామికి శైవాగమ పద్ధతిలో నిత్యవిధి పూజా కైం కర్యాలు కొనసాగాయి. సుప్రభాతం తో స్వామిని మేల్కొలిపిన పూజారులు నిత్య పూజలు నిర్వహించారు.

శివాలయంలో శివపార్వతుల సేవోత్సవం నిర్వహిస్తున్న అర్చకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదగిరిగుట్ట, జూలై 4: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో సోమవారం శివకేశవులకు విశేష పూజలు సంప్రదాయరీతిలో నిర్వహించారు. లక్ష్మీనృసింహుడికి శ్రీవైష్ణవ ఆచార పరంగా, శివాలయంలో కొలువుదీరిన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామికి శైవాగమ పద్ధతిలో నిత్యవిధి పూజా కైం కర్యాలు కొనసాగాయి. సుప్రభాతం తో స్వామిని మేల్కొలిపిన పూజారులు నిత్య పూజలు నిర్వహించారు. ప్రధానాలయంలోని స్వయంభూ మూర్తులకు నిజాభిషేకం, సహస్రనామార్చనలు చేసి, మండపంలో సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఆలయ అష్టభుజి ప్రాకార మండపంలో లక్ష్మీనృసింహుడిని దివ్యమనోహరంగా అలంకరించిన ఆచార్యులు దేవతల సేనానాయకుడు విశ్వక్సేనుడికి తొలి పూజలతో సుదర్శన హోమం, నిత్య తిరు కల్యాణోత్సవ పర్వాలను వైభవంగా నిర్వహించారు. కొండపైన అనుబంధ ఆలయమైన పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి సన్నిధిలో మూలమూర్తులను, ముఖమండపంలోని స్ఫటికమూర్తులను అభిషేకించారు. లక్ష్మీనృసింహుడిని బీసీ సంక్షే మ శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి బుర్రా వెంకటేశం కుటుంబసమేతంగా దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. గుట్టపైన సౌకర్యాలు లేకపోవడంతో దివ్యాంగులు ఇబ్బందులుపడుతున్నారు. కొండపైన పీఆర్వో కార్యాలయంలో దివ్యాంగులకు, వృద్ధుల కోసం వీల్‌చైర్‌ సౌకర్యం కల్పించినా, వాటిని తీసుకెళ్లే వ్యవస్థ సరిగా లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.

Updated Date - 2022-07-05T05:48:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising