ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాదగిరిగుట్టలో హరిహరులకు విశేష పూజలు

ABN, First Publish Date - 2022-10-04T05:48:22+05:30

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో సోమవారం హరిహరులకు విశేష పూజలు సంప్రదాయరీతిలో కొనసాగాయి.

ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న అర్చకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదగిరిగుట్ట, అక్టోబరు 3: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో సోమవారం హరిహరులకు విశేష పూజలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో స్వయంభువులు లక్ష్మీనృసింహుడికి, స్మార్త సంప్రదాయ పద్ధతిలో శివాలయంలోని రామలింగేశ్వరస్వామికి, స్ఫ టిక రామలింగేశ్వరుడికి నిత్యవిధి కైంకర్యాలు నిర్వహించారు. సోమవారం సాయంత్రం ఆరు గంటల వరకు లక్ష్మీనృసింహుడిని 9,542మంది భక్తులు దర్శించుకోగా, వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.18,97,076 ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.


వైభవంగా శరన్నవరాత్రి మహోత్సవాలు

యాదగిరిగుట్ట ప్రధానాలయ అనుబంధ ఆలయమైన శివాలయంలో శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు దుర్గాష్టమిని పురస్కరించుకుని విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. శివాలయంలో కొలువుదీరిన పర్వతవర్ధినీ అమ్మవారిని ఆరాదిస్తూ అర్చకులు ప్రాతఃకాల పూజ, సహస్రనామార్చన, వేదపారాయణలు, గాయత్రీ జపాలు నిర్వహించారు. సాయంత్రం వేళ శివాలయ యాగశాలలో చండీ హవనం జరిపారు. సాయంత్రం 7.30గంటలకు నవావరణ పూజ, సువాసినీ పూజలను శైవాగమ పద్ధతిలో నిర్వహించారు.

Updated Date - 2022-10-04T05:48:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising